సురేఖ వాణి ,సుప్రిత కలసి చేసుకొనే వీకెండ్ పార్టీల గురించి చెప్పాల్సిన పనిలేదు.అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి చిందులేస్తూ ఉంటారు. సమయం దొరికితే చాలు ఎక్కువగా గోవాకి పైనమై అక్కడ నానా హంగామా చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా బ్యాంకాక్, దుబాయ్ వంటి ప్రాంతాలకు కూడా వెళుతూ ఉంటారు ఈ తల్లి కూతుర్లు. ముఖ్యంగా పార్టీలలో పబ్బులలో బీచ్లలో పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది సుప్రీత. సినిమా అవకాశాలు వచ్చేదే ఆలస్యం ఇక రెచ్చిపోతుందని టాక్ అయితే వినిపిస్తూ ఉంటుంది. గతంలో తన కూతురు ఎంట్రీ గురించి కూడా సురేఖ వాణి మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తానంటే అడ్డు చెప్పేది లేదంటూ కూడా తెలియజేసింది.
ఒక సెలబ్రిటీ డాటర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సుప్రీత సోషల్ మీడియాలో భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నది. రీసెంట్ గా ఒక సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చినట్లు సమాచారం. బిగ్ బాస్ అమర్దీప్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలియజేసింది. ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయని సమాచారం. షూటింగ్ ఎంతవరకు వచ్చిందని విషయం మాత్రం ఇంకా తెలియడం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సురేఖ వాణి ఎన్నో చిత్రాలలో నటించింది. అయితే ఈ మధ్యకాలంలో చాలా తక్కువ చిత్రాలలో మాత్రమే కనిపిస్తూ ఉన్నది.