తమిళ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన స్టార్ హీరోలలో తలపతి విజయ్ ఒకరు. విజయ్ తాజాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ది గోట్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటించాడు. ఈ మూవీ లో విజయ్ తండ్రి పాత్రలోనూ , కొడుకు పాత్రలోనూ నటించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి సంబంధించిన ఒక రోజు బాక్స్ ఆఫీసర్ కంప్లీట్ అయింది. మరి మొదటి రోజు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు వచ్చాయి. మొత్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ స్టేటస్ కి ఈ మూవీ ఇంకా ఎన్ని కోట్ల దూరంలో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు తమిళ నాడు ఏరియాలో 31.65 కోట్ల కలెక్షన్లు రాగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.80 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. కర్ణాటక ఏరియాలో 10.5 కోట్ల కలెక్షన్లు రాగా , కేరళ ఏరియాలో 5.80 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ మూవీ కి మొదటి రోజు 4 కోట్ల కలెక్షన్లు రాగా , ఓవర్ సీస్ లో 49.35 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 51.80 కోట్ల షేర్ ... 104.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 185 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 187 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ ఫార్ములా అండ్ కంప్లీట్ చేసుకుని ఇటు స్టేటస్ ను అందుకోవాలి అంటే మరో 135.20 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టవలసి ఉంది. మరి ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్లను రాబట్టి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: