నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె బద్రి అనే మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను వివాహం చేసుకుంది. ఇక వివాహం తర్వాత వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. కానీ ఆ తర్వాత కొన్ని మనస్పర్ధలు కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం వీరు ఎవరికి వారు జీవినాన్ని గడుపుతున్నారు. ఇది ఇలా ఉంటే రేణు దేశాయ్ కి వీధి కుక్కలు అంటే చాలా ఇష్టం. ఇప్పటికే పలు సందర్భాలలో వీధి కుక్కలను కాపాడడం కోసం ఆమె స్పందించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.

కొన్ని రోజుల క్రితం ఓ సినిమా విడుదల అయింది. అందులో వీధి కుక్కల గురించి తప్పుడు పదజాలం ఉండడంతో ఆమె గట్టిగా స్పందించింది. ఇక అలాంటి సినిమా ఫ్లాప్ కావడం పెద్ద తప్పేమీ కాదు అంటూ గట్టిగా స్పందించింది. అసలు ఆ సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో కొన్ని రోజుల క్రితం ఇండియన్ 2 అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొంది. ఇక ఈ సినిమాపై రేణు దేశాయ్ నిరాశను వ్యక్తం చేయడం మాత్రమే కాకుండా రచయితపై కోపాన్ని కూడా ప్రదర్శించింది.  

సినిమా నుండి ఒక క్లిప్ ని షేర్ చేసి నటుడు కమల్ హాసన్ వీధి కుక్కలను కించపరిచే పదజాలాన్ని ఉపయోగించారు అని చెప్పుకొచ్చింది. ఇలాంటి సినిమాలు ఫ్లాప్ అయినందుకు నిజంగా సంతోషిస్తున్నాను అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ఇక జంతువులపై తనకు ఉన్న ప్రేమ మరోసారి ఈ విషయం ద్వారా స్పష్టం అవుతుంది. రేణు దేశాయ్ కొంతకాలం క్రితం టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ లో రవితేజ హీరోగా నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: