యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం దేవర అనే సినిమా చిత్రీకరణ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కానుంది. ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనుండగా , అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ మూడు పాటలను విడుదల చేశారు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ బృందం ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయాలి అని చూస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా యొక్క ట్రైలర్ ను సెప్టెంబర్ 10 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో ఆయుధ పూజకు సంబంధించిన ఒక సాంగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఆ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేయకూడదు అని మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

దానితో ఈ సాంగ్ ను నేరుగా థియేటర్లలోనే ప్రేక్షకులు చూసేలా మూవీ బృందం ప్లానింగ్ వేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబోలో రూపొందిన జనతా గ్యారేజ్ మూవీ అద్భుతమైన విజయం సాధించడం ఆర్ ఆర్ ఆర్ లాంటి బ్లాక్ బాస్టర్ విజయం తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ కావడంతో దేవర సినిమాపై ప్రస్తుతానికి దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: