కొరటాల శివ దర్శకత్వంలో తెరకేక్కుతున్న దేవర మూవీ ఇక ఈనెల 27వ తేదీన విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే ఈ తేదీ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు అందరూ కూడా వేయకళ్లతో ఎదురుచూస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు కూడా ప్రేక్షకులందరికీ కూడా బాగా నచ్చేసాయి. సోషల్ మీడియాలో ఇక ఎక్కువ వ్యూస్ సాధిస్తూ సెన్సేషన్స్ అయితే మరికొన్ని రోజుల్లో దేవర సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ఈ ట్రైలర్ ఈవెంట్ ఎక్కడ నిర్వహించబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఈ ట్రైలర్ ఈవెంట్ నిర్వహించిన కూడా భారీగా తరలి వెళ్లాలని అభిమానులు అందరూ కూడా అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో దేవర టీం మాత్రం అభిమానులకు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకోబోతుందట. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషన్స్ పై దృష్టి సారించినట్లు తెలుస్తుంది. అయితే ఈ నెల 10వ తేదీన ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగబోతుందట. ఇందులో మూవీ టీం అంతా పాల్గొంటారని సినీ వర్గాల నుంచి సమాచారం. కాగా ట్రైలర్ రెండు నిమిషాల 45 సెకండ్ల ఉంటుందని తెలుస్తుంది. కాగా దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.