పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్లో చాలా బ్లాక్ బస్టర్ సినిమాలను రిజెక్ట్ చేశాడు. ఇక పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలతో రవితేజ ఏకంగా రెండు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాడు. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మొదట బద్రి అనే మూవీ వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇక బద్రి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ , పూరి జగన్నాథ్ కాంబో లో కెమెరామెన్ గంగతో రాంబాబు అనే మూవీ రూపొందింది. ఈ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. బద్రి , కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా మధ్యలో చాలా సంవత్సరాలు ఉంది. ఈ మధ్యలో కూడా పూరి జగన్నాథ్ , పవన్ తో సినిమాలు చేయాలి అని అనేక కథలను చెప్పాడట. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ సినిమాలు చేయలేదట. 

ఇక పూరి జగన్నాథ్ , పవన్ కళ్యాణ్ కు ఇడియట్ , అమ్మానాన్న ఓ తమిళమ్మాయి , పోకిరి మూడు కథలను వివరించాడట. ఈ కథలను విన్న పవన్ పాజిటివ్ గానే స్పందించిన ఆ తర్వాత మాత్రం సినిమాలు చేయడంలో పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదట. దానితో ఇడియట్ , అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలను రవితేజ తోనూ , పోకిరి మూవీ ని మహేష్ బాబు తోనూ చేసి పూరి జగన్నాథ్ ఈ మూడు మూవీ లతోనూ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాడు. పవన్ కళ్యాణ్ చేసిన మూవీలతో రవితేజ ఏకంగా రెండు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాడు. అలాగే రవితేజ హీరోగా కెరియర్ను ప్రారంభించిన కొత్తలో ఇడియట్ అమ్మానాన్న తమిళ అమ్మాయి సినిమాలలో హీరోగా నటించాడు. ఈ రెండు మూవీ లు మంచి విజయాలు సాధించడంతో రవితేజకు మంచి గుర్తింపు , తెలుగు సినీ పరిశ్రమలో మంచి స్థాయి లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: