మెగాస్టార్ చిరంజీవి గొప్ప డాన్సర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాలలో ఎన్నో గొప్ప గొప్ప డాన్స్ స్టెప్పులను వేశాడు. ఈయన డాన్స్ కోసమే సినిమాలను ఎగబడి చూసిన జనాలు కూడా ఎంతో మంది ఉన్నారు. ఇకపోతే చిరంజీవి వేసిన అత్యంత గొప్ప డాన్స్ స్టెప్పులలో ఇంద్ర మూవీ లోని దాయి దాయి దమ్మా సాంగ్ లోని వీన స్టెప్ ఒకటి. ఈ వీన స్టెప్ ఈ సినిమా విడుదల తర్వాత సంచలనాన్ని సృష్టించింది. ఇప్పటికి కూడా ఈ స్టెప్ ఒక ఫుల్ ఫేమస్. ఇక అంత గొప్ప స్టెప్ కోసం చిరంజీవి కూడా భారీ ఎత్తున కష్టపడ్డాడట. ఇక ఈ మూవీ లోని ఈ సాంగ్ షూటింగ్ ను స్విట్జర్లాండ్ లో చేస్తున్న సమయంలో డాన్స్ మాస్టర్ ఈ స్టెప్ ను చిరంజీవి కి చేసి చూపించాడట. ఇక చిరంజీవి కూడా చాలా ఈజీగానే ఈ స్టెప్ వేశాడట.

కాకపోతే ఈ మూవీ లోని ఈ స్టెప్ అత్యంత పర్ఫెక్ట్ గా రావడం కోసం చిరంజీవి కేవలం ఈ ఒక్క స్టెప్ నే ఐదు గంటల పాటు ప్రాక్టీస్ చేశాడట. ఇక డాన్స్ మాస్టర్లు , ఇటు దర్శకుడు వద్దు సార్ మీరు ఆల్రెడీ సూపర్ గా చేస్తున్నారు. అంత కష్టపడాల్సిన అవసరం లేదు అని చెప్పిన కూడా చిరంజీవి ఈ డాన్స్ మూమెంట్ సూపర్ గా ఉంది. మనం మరింత కష్ట పడి దీనిని చేసినట్లు అయితే ఈ స్టెప్ అద్భుతమైన స్థాయిలో వస్తుంది అని చెప్పి చిరంజీవి ఒక్క స్టెప్ కోసమే ఐదు గంటలు కష్టపడి ఈ స్టెప్ ను వేశాడట.

ఇక చిరంజీవి కష్టం ఏ మాత్రం వృధా కాలేదు. ఈ మూవీ లోని ఈ డాన్స్ మూమెంట్ ఇప్పటికీ కూడా ప్రేక్షకుల నుండి గుర్తింపు పొందుతుంది. ఇకపోతే చిరంజీవి హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఇంద్ర సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: