తెలుగు సినీ పరిశ్రమలో మంచి నిర్మాతగా , డిస్ట్రిబ్యూటర్ గా పేరు సంపాదించుకున్న వారిలో దిల్ రాజు ఒకరు. ఈయన ఓ వైపు సినిమాలను నిర్మిస్తూనే , మరోవైపు సినిమాలను డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తూ వస్తున్నాడు. ఇక తాజాగా దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు కు మీరు కేవలం డిస్ట్రిబ్యూటర్ గా మాత్రమే అయితే ఇన్ని సంవత్సరాల పాటు కెరియర్ను కొనసాగించేవారా అనే ప్రశ్న ఆయనకు ఎదురయింది. దానికి దిల్ రాజు సమాధానం ఇస్తూ ... కేవలం డిస్ట్రిబ్యూటర్ గా అయితే నేను ఇన్ని సంవత్సరాల పాటు సినిమా పరిశ్రమలో కొనసాగే వాడిని కాదు. ఎందుకు అంటే డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమా బ్లాక్ బస్టర్ అయినా కూడా చాలా తక్కువ మొత్తంలో డబ్బులు వస్తూ ఉంటాయి.

ఉదాహరణకు చెప్పాలి అంటే నేను సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన స్పైడర్ మూవీ ని చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు పెట్టి కొన్నాను. ఇక ఆ మూవీ విడుదల అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఆ ఒక్క సినిమాతోనే నాకు 12 కోట్ల నష్టం వచ్చింది. కేవలం డిస్ట్రిబ్యూటర్ గా అయితే 12 కోట్ల నష్టాన్ని భర్తీ చేయడం చాలా కష్టం. అదే సంవత్సరంలో నేను నిర్మించిన కొన్ని సినిమాలు విడుదల అయ్యాయి. అవి మంచి విజయాలను సాధించాయి. ఇక వాటిలో వచ్చిన లాభాలు , ఈ సినిమాతో వచ్చిన నష్టాలు కలిసి నేను సేఫ్ జోన్ లో ఉన్నాను.

అందుకే కేవలం డిస్ట్రిబ్యూటర్ గా అయ్యి ఉంటే నేను ఆ సినిమాతోనే చాలా నష్టాల్లో కోరుకుపోయే వాడిని. ఇటు డిస్ట్రిబ్యూటర్ గా , అటు నిర్మాత రెండింటిగా కెరియర్ను కొనసాగిస్తున్నాను కాబట్టే నేను ఇన్ని సంవత్సరాలు పాటు సినీ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ గా కెరియర్ ను ముందుకు సాగించగలుగుతున్నాను అని దిల్ రాజు తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: