నాగచైతన్య కాపురంలో మెగా హీరో చిచ్చు పెట్టడమా..ఇంతకీ ఆ హీరో ఎవరు? నాగచైతన్య కాపురంలో ఎందుకు ఆయన చిచ్చు పెట్టాడు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్ లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. నాగ చైతన్య సమంతను ప్రేమించి పెళ్లాడాక ఆమెకు విడాకులు ఇచ్చాక మళ్లీ రెండో పెళ్లికి రెడీ అయ్యారు. అలా సినీ నటి శోభిత ధూళిపాళ్లను రెండో పెళ్లి చేసుకోవడానికి ఆయన సిద్ధమయ్యారు.తాజాగానే వీరికి సంబంధించిన బంధాన్ని ఆఫీషియల్ గా ఎంగేజ్మెంట్ ద్వారా బయటపెట్టారు. ఇక త్వరలోనే పెళ్లికి రెడీ అయిన ఈ జంట గురించి సోషల్ మీడియాలో ఒక రూమర్ వైరల్ అవుతుంది. ఆ మెగా హీరో అప్పుడు సమంతతో ఇప్పుడు నాగచైతన్యకి కాబోయే భార్యతో అంటూ టైటిల్స్ పెడుతూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఇక విషయంలోకి వెళ్తే.. నాగ చైతన్య సమంతని పెళ్లి చేసుకున్నాక కూడా ఆమె సినిమాల్లో చేసింది. అలా చాలామంది స్టార్ హీరోల సరసన నటించింది. రామ్ చరణ్ తో రంగస్థలం సినిమాలో సమంత రొమాన్స్ చేసిన సంగతి మాకు తెలిసిందే.. అటు సమంతనే అనుకుంటే ఇటు నాగచైతన్య పెళ్లి చేసుకోబోయే హీరోయిన్ తో కూడా రామ్ చరణ్ కి సంబంధించిన కొన్ని పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.. ఈ ఫోటోలు చూస్తుంటే శోభితకి నాగచైతన్య కంటే ముందే రామ్ చరణ్ తో పెళ్లయిందా అని కొంతమంది నెటిజన్స్ అవాక్కవుతున్నారు.

ఇక అసలు విషయం ఏమిటంటే.. నాగచైతన్యకి కాబోయే భార్య శోభిత ధూళిపాళ్ళతో రామ్ చరణ్ ఒక యాడ్లో నటించారు..మాన్యవార్ అనే దుస్తుల కంపెనీ వ్యాపార ప్రకటనలో రామ్ చరణ్,శోభిత దూళిపాళ్లలు కలిసి నటించారు. అయితే వీరికి సంబంధించిన ఈ యాడ్ నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో సమంతతో నటించి అప్పుడు అలా.. అలాగే ఇప్పుడు పెళ్లికి ముందే శోభిత ధూళిపాళ్లతో యాడ్లో నటించి ఇప్పుడు ఇలా..నాగచైతన్య కాపురంలో చిచ్చు పెడుతున్నాడు అంటూ సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్, మీమ్స్ వైరల్ చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: