గత కొద్ది రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న స్నేహ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. కొన్నేళ్ల నుంచి సహాయ పాత్రలలో నటిస్తూ బుల్లితెరపై సందడి చేస్తుంది. స్నేహ దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. తమిళ్ హీరో ప్రసన్నను ప్రేమించి వివాహం చేసుకున్న స్నేహ తన కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడిపింది. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు. ఇటీవలే స్నేహ వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టారు.
చెన్నైలో షాపింగ్ మాల్ ప్రారంభించారు. నటిగా తనకున్న క్రేజ్ ను ఉపయోగించుకొని బిజినెస్ ప్రారంభించి మంచి లాభాలతో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా.... స్నేహకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. స్నేహ సినిమాల్లో నటిస్తున్న సమయంలో ఓ ప్రొడ్యూసర్ తో ప్రేమాయణం సాగించిందట. అతడిని వివాహం చేసుకోవాలని అనుకుందట. ఇద్దరు వివాహానికి కుటుంబ సభ్యులను ఒప్పించుకున్నారు.
ఆ తర్వాత స్నేహకు ఆ ప్రొడ్యూసర్ కు అంతకుముందే వేరే అమ్మాయిలతో ఎఫైర్లు ఉన్నాయని, ప్రేమ పేరుతో కొంతమందిని మోసం చేశారని తెలియడంతో అతని నుంచి దూరంగా వెళ్లిపోయిందట. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. కాగా, ఈ ఒక్క నిర్మాతతోనే కాదు.. చాలా హీరోలతో కూడా అలనాటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్నేహ ఎఫైర్లు పెట్టుకున్నట్లు వార్తలు అప్పట్లోనే వచ్చాయి. కానీ అవన్నీ ఫేక్ అని తేలాయి.