కమల్‌హాసన్ టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ఇండియన్ 2 . స్టార్ డైరెక్టర్ శంకర్‌  దర్శకత్వం వహించాడు. జులై 12న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రానికి మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. తెలుగులో భారతీయుడు 2గా, హిందీలో హిందూస్తానీ 2గా విడుదలైంది. ఆగ‌స్టు 9న ఓటీటీలో రిలీజ్ అయ్యింది సినిమా. 'భార‌తీయుడు' సినిమాకి సీక్వెల్ గా దాదాపు 30 ఏళ్ల త‌ర్వాత 'భార‌తీయుడు - 2' సినిమాని తెర‌కెక్కించాడు డైరెక్ట‌ర్ శంక‌ర్. ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ సేతుప‌తిగా అల‌రించారు. అయితే, క‌మ‌ల్ హాస‌న్ యాక్టింగ్ కి పూర్తిగా మార్కులు ప‌డిన‌ప్ప‌టికీ సినిమా

 పెద్ద‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య రిలీజైన సినిమా అనుకున్నంత‌గా ఆడ‌లేదు. ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ తో పాటు హీరో సిదార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్, బాబీ సింహా, ఎస్ జే సూర్య‌, వివేక్, కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌దిత‌రులు న‌టించారు. ఇక ఈ సినిమాని ఉద‌య్ నిధి స్తాలిన్, సుభాష్ క‌ర‌ణ్ సంయుక్తంగా నిర్మించారు.  అయితే తాజాగా, ఇండియన్-2 మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ పెట్ లవర్స్‌ను కించపరిచేలా ఉన్నాయంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో

 టాలీవుడ్ నటి పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తనదైన స్టైల్లో పోస్ట్ పెట్టింది. అంతేకాకుండా అసలు ఇలాంటి డైలాగ్స్ ఎలా రాస్తారో అని ఫైర్ అయింది. ఓ వీడియోను షేర్ చేసిన ఆమె ''ఇండియన్ సినిమా ఫ్లాప్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది డిజాస్టర్ కావాల్సిన మూవీనే. అసలు ఈ ఇడియట్ రైటర్స్ ఎలా రాస్తున్నారు ఇలాంటి డైలాగ్స్. అసలు వాళ్ళకి ఏమైంది'' అని రాసుకొచ్చింది.  చేతులు జోడించి దండం పెట్టిన ఎమోజీని షేర్ చేసింది. ప్రజెంట్ రేణు దేశాయ్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: