నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. బ్లాక్‌బస్టర్‌ ‘హను-మాన్‌’ ఫేం ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని సుధాకర్‌ చెరుకూరి తన ఎస్వీఎల్‌ సినిమాస్‌పై లెజెండ్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ చిన్నకుమార్తె తేజస్విని ఈ సినిమాకి సమర్పకురాలు కావడం విశేషం. శుక్రవారం మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని ైస్టెలిష్‌ అండ్‌ మోడరన్‌ అవతార్‌లో ప్రజెంట్‌ చేస్తూ ఓ స్టిల్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఆకర్షణీయమైన

 చిరునవ్వుతో, మెస్మరైజింగ్‌ ప్రజెన్స్‌తో చాలా అందంగా కనిపిస్తున్నారు మోక్షజ్ఞ. ప్రశాంత్‌వర్మ మాట్లాడుతూ ‘మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే అవకాశం రావడం గొప్ప గౌరవంగా, అంతకంటే పెద్ద బాధ్యతగా భావిస్తున్నా. ఇది ఇతిహాసాల నుంచి స్పూర్తి పొందిన స్క్రిప్ట్‌. ప్రశాంత్‌ వర్మ సినిమా యూనివర్స్‌లో ఇది ఒక భాగం. నా యూనివర్స్‌ని నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లే సినిమా అవుతుంది. ప్రస్తుతం మోక్షూ నటశిక్షణలో ఉన్నారు. డ్యాన్స్‌, ఫైట్లు.. ఇలా ప్రతి విషయంలో స్పెషల్‌ ట్రైనింగ్‌ తీసుకుంటున్నారు. అయితే ఇదంతా బాగానే ఉన్నా.. తెర వెనుక జరిగిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చెప్పాలంటే

 మోక్షు సినీ ఎంట్రీ అదిగో.. ఇదిగో అంటూ ఇప్పుడు జరిగింది. అభిమానులను ప్రతిసారి ఊరించి ఉసూరుమనిపించారు. కానీ బాలయ్య మాత్రం బ్యాక్ గ్రౌండ్ వర్క్ ను ఎప్పుడో స్టార్ చేసేశారు. ఎనిమిదేళ్ల క్రితం నుంచే తన కుమారుడి ఎంట్రీ కోసం ఆలోచిస్తున్నారు. స్టోరీ అండ్ డైరెక్టర్ కోసం అనేక చర్చలు జరిపారు.  ఏదేమైనా ఫైనల్ గా 30వ ఏడాదిలో సినీ ఎంట్రీ ఇస్తున్నారు మోక్షు. అయితే సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎందరో వారసులు ఎంట్రీ ఇచ్చారు. కానీ ఒక బిగ్ ఫ్యామిలీ నుంచి చాలా ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన హీరో మాత్రం మోక్షజ్ఞ అనే చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: