కానీ టాలీవుడ్ లో అలా కనిపించడం లేదు. ఎవరికి వాళ్ళు అక్టోబర్ డేట్ అని సినిమాలతో నింపేస్తున్నారు. పీపుల్స్ మీడియా అ యితే ఏకంగా రెండు సినిమాలు అక్టోబర్లో థియేటర్లలోకి తెస్తోంది. అందులో ఒక సినిమాను జస్ట్ వారం రోజుల గ్యాప్లో వేస్తోంది. మరో వారం తిరగకుండా గోపీచంద్ విశ్వం సినిమాను ప్రకటించింది.. దిల్ రాజు ఓ సినిమాను తీసుకువస్తున్నారు. అల్లరి నరేష్ బచ్చలమల్లి కూడా అక్టోబర్లోనే రావాలని అనుకుంటుంది. రజినీకాంత్ సినిమా డైరెక్టర్ కూడా వేట్టయ్యాన్ కూడా దేవర వచ్చిన రెండు వారాల్లో వస్తోంది.
ఇవి కాక చిన్న చిన్న సినిమాలు చాలా అక్టోబర్ లో ఉన్నాయి. దసరాకు చాలా మందుకే దేవర డేట్ వేయడమే ఇందుకు కారణం కావచ్చు. ఏమిటి వీళ్ల ధైర్యం ... దేవర సినిమా దసరా సీజన్ వరకు మొత్తం థియేటర్లను హోల్డ్ చేయలేదని నమ్మకం వీళ్ళకు ఉందా మరి ఏమిటో అర్థం కావడం లేదు. అయితే ఇప్పటివరకు దేవర నుంచి వచ్చిన కంటెంట్ కొంతవరకు బాగానే ఉంది. అలా అని అద్భుతమైన ఆడియో ఆల్బమ్ అయితే కాదు .. ఇక మిగిలింది ట్రైలర్ .. తర్వాత సినిమా రిలీజ్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కానీ డేట్ లో వేసిన వాళ్లంతా అలాగే ఫిక్స్ అవుతారా లేదా వెనక్కి వెళ్తారా అన్నది చూడాలి.