పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా ఈ ఏడాది జూన్ 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఆరంభం నుంచే పాజిటివ్ టాక్‍తో భారీ కలెక్షన్లు దక్కించుకుంది. తెలుగు, హిందీల్లో భారీ వసూళ్లు దక్కించుకుంది. తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్లు కూడా మంచి కలెక్షన్లు సాధించాయి. మొత్తంగా ఈ మూవీ సుమారు రూ.1,200 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. మహాభారతం స్ఫూర్తితో డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా కల్కి 2898ఏడీని నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. ఈ మూవీకి సంతోషన్ నారాయణ్ సంగీతం అందించారు. వైజయంతీ మూవీస్ పతాకంపై భారీ బడ్జెట్‍తో అశ్వినీదత్ నిర్మించారు.

కల్కికి సీక్వెల్ కూడా రానుంది. ఇక ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్ ప్రధాన పాత్రలు పోషించారు. సస్వత ఛటర్జీ, దిశా పటానీ, పశుపతి, శోభన, రాజేంద్ర ప్రసాద్, అన్నా బెన్ కీలక పాత్రలో నటించారు. ఇలాంటి క్రమంలో తమిళ్ దర్శకుడు అయిన గౌతమ్ మీనన్ కూడా ప్రభాస్ తో ఒక భారీ యాక్షన్ ఓరియంటెడ్ సినిమాని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక గౌతమ్ మీనన్ అనగానే మనకు లవ్ స్టోరీ, గ్యాంగ్ స్టర్ సినిమాలు గుర్తుకొస్తూ ఉంటాయి.  ఆయన డిఫరెంట్ జానర్స్ లో సినిమాలను చేస్తూ వైవిధ్యభరితమైన కథాంశాలతో సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటాడు.

అందువల్లే ఆయనకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అయితే ఉంది. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయనకు చాలా మంచి పేరు అయితే ఉంది. ప్రభాస్ ని గ్యాంగ్ స్టర్ గా చూపించి భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రణాళికలను రూపొందిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ప్రభాస్ ఫుల్ లెంత్ గ్యాంగ్ స్టర్ రోల్ ని పోషించలేదు. కాబట్టి ఆయనకు ఈ క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉంటుందని పలువురు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: