నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న ప్రకటన రానే వచ్చింది. నందమూరి బాలకృష్ణ ముద్దుల తనయుడు మోక్షజ్ఞ అరంగేట్ర సినిమా ఎట్టకేలకు ఖరారైంది.
శుక్రవారం మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా సరికొత్త పోస్టర్‌తో ఈ సినిమాను అనౌన్స్ చేశారు.ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్‌లో భాగంగా విజువల్ వండర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దబోతున్నారు. మోక్షజ్ఞ సోదరి తేజస్విని ఈ చిత్రంలో నిర్మాణ భాగస్వామి కావడం.. బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటైన 'లెజెండ్' పేరుతోనే నిర్మాణ సంస్థను నెలకొల్పడం విశేషం. ఐతే శుక్రవారం కేవలం పోస్టర్‌తోనే సరిపెట్టారు. ఈ రోజుకు అనౌన్స్‌మెంట్ మాత్రమే. మోక్ష తొలి చిత్రం లాంచింగ్ వ్యవహారం వేరుగా ఉండబోతోంది.బాలయ్య ప్రత్యేకంగా ముహూర్తం పెట్టించి మోక్షు తొలి సినిమా ముహూర్త వేడుకను అంగరంగ వైభవంగా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇండస్ట్రీ నుంచి అతిరథ మహారథులను పిలిచి.. అభిమానులను కూడా ఆహ్వానించి ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి చూస్తున్నారట.అభిమానులు ఎన్నో ఏళ్ల పాటు ఎదురు చూసిన అరంగేట్రం కావడం.. ఈ సినిమాకు ఆరంభం నుంచే భారీ హైప్ తీసుకురావడం అవసరమని భావించి లాంచింగ్ నెవర్ బిఫోర్ అన్నట్లుగా చేయాలని అనుకుంటున్నారట.

అక్టోబరులో మంచి ముహూర్తం చూసి ఈ వేడుక చేస్తారని.. వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైపోతుందని.. వచ్చే ఏడాది సినిమా రిలీజవుతుందని నందమూరి కుటుంబ వర్గాల సమాచారం.ఇదిలావుండగా పర్ఫెక్ట్ హీరో కటౌట్‌తో నందమూరి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. అయితే.. గతంలో మోక్షు ఇలా లేడు. కాస్త బొద్దుగా ఉండేవాడు. దీంతో.. బాలయ్య వారసుడు హీరో అవుతాడా? లేదా? అనే సందేహాలు కూడా వెలువడ్డాయి.కానీ ఇప్పుడు సాలిడ్ లుక్‌లోకి వచ్చేశాడు మోక్షు. మరి బొద్దుగా ఉన్న మోక్షు.. హీరో కటౌట్‌లోకి రావడానికి ఎంత వెయిట్ లాస్ అయ్యాడు? అంటే, దాదాపు 18 కేజీ బరువు తగ్గినట్టుగా తెలుస్తోంది. హీరోగా మారాలని డిసైడ్ అయిన మోక్షజ్ఞ, ఫిట్‌నెస్‌పైన పూర్తి ఫోకస్ పెట్టాడు. దీంతో.. ఐదారు నెలల్లోనే భారీగా బరువు తగ్గినట్టుగా చెబుతున్నారు. ఇప్పుడు.. ఈ కటౌట్‌ చూసి బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక బాలయ్య వారసుడు రాక కోసం ఎదురు చూస్తున్న అభిమానులు.. ఫస్ట్ లుక్ బయటికి రావడమే లేట్ అన్నట్టుగా.. భారీ కటౌట్‌లు ఏర్పాట్లు చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక 30 ఏళ్ల వయసులో హీరోగా ఎంట్రీ ఇస్తున్న మోక్షజ్ఞ, ఫస్ట్ సినిమానే సోషియో ఫాంటసీ కథను ఎంచుకున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా రాబోతోంది. మరి మోక్షుని ప్రశాంత్ వర్మ ఎలా ప్రజెంట్ చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: