కొన్ని సంవత్సరాల క్రితం నితిన్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సై అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. 2004 వ సంవత్సరం మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా భారీ కలక్షన్లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టింది. ఇలా ఆ సమయంలో అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. 

వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ సై మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా మరి కొంత కాలంలోనే రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ మూవీ ని ఏ తేదీన విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని ఈ మూవీ యూనిట్ మరికొన్ని రోజుల్లోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ అయిన సినిమాలు అద్భుతమైన స్థాయిలో ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నా విషయం మనకు తెలిసిందే.

మరి సై సినిమా అద్భుతమైన విజయం సాధించిన సినిమా , మరి ఈ సినిమాకు కూడా రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతాయి అని చాలా మంది ప్రేక్షకులు భావిస్తున్నారు. మరి ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి , ఏ రేంజ్ రెస్పాన్స్ ను జనాల నుండి తెచ్చుకుంటుందో చూడాలి. ఇకపోతే ఈ మూవీ ద్వారా నితిన్ , జెనీలియా , రాజమౌళి ముగ్గురికి కూడా అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: