నిర్మాతగా , డిస్ట్రిబ్యూటర్ గా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన వారిలో దిల్ రాజు ఒకరు. దిల్ రాజు ఓ వైపు సినిమాలను నిర్మించడం మాత్రమే కాకుండా మరో వైపు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నాడు . తన కెరియర్ లో ఎన్నో చిన్న సినిమాలను , భారీ బడ్జెట్ సినిమాలను కూడా డిస్ట్రిబ్యూషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి . ఇకపోతే తాజాగా దిల్ రాజు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు . అందులో భాగంగా ఈయన డిస్ట్రిబ్యూషన్ లో ఉండే సమస్యల గురించి చెప్పుకొచ్చాడు.

తాజాగా దిల్ రాజు మాట్లాడుతూ ... డిస్ట్రిబ్యూషన్ రంగం చాలా కఠిన పరిస్థితులతో కూడి ఉంటుంది. చాలా వరకు డిస్ట్రిబ్యూషన్ రంగంలో నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  సినిమా బ్లాక్ బస్టర్ అయిన కూడా డిస్ట్రిబ్యూటర్ కు వచ్చే లాభాలు తక్కువే. సినిమా ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్ కు పెద్ద మొత్తంలో నష్టాలు వస్తూ ఉంటాయి. దానితోనే ఎక్కువ రోజులు పాటు చాలా మంది డిస్ట్రిబ్యూషన్ రంగంలో కొనసాగలేరు. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం బాహుబలి సినిమా యొక్క డిస్ట్రిబ్యూషన్ హక్కులను దక్కించుకున్నాను. ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

మూవీ భారీ కలెక్షన్లు కూడా రాబట్టింది. అంత గొప్ప విజయం సాధించి , అన్ని కలెక్షన్లను రాబట్టిన ఆ సినిమాకు కేవలం నాకు పది కోట్లు మాత్రమే మిగిలాయి. ఇక ఓ వైపు నిర్మాతగా కొనసాగుతూ , మరో వైపు డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాను కాబట్టే ఒక దాంట్లో వచ్చిన లాభాలను మరొక దాంట్లోకి చేర్చుకుంటూ కెరియర్ను ముందుకు సాగిస్తున్నాను. అందుకే నేను ఇంత కాలం పాటు సినీ రంగంలో నిర్మాతగా , డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగుతున్నాను అని దిల్ రాజు తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dr