కొంత మంది నటీమణులకు విజయాలు లేకపోయినా అవకాశాలు మాత్రం వరుసగా వస్తూ ఉంటాయి. అలా విజయాలు లేకపోయినా వరసగా అవకాశాలు వస్తున్న సమయంలో అయిన వారు మంచి కథలను ఎంచుకొని సినిమాలతో మంచి విజయాలను అందుకున్నట్లు అయితే ఆ తర్వాత హీరోయిన్ గా మంచి స్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో వరుస అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ముద్దుగుమ్మలలో కావ్య థాపర్ ఒకరు. ఈమె ఇప్పటి వరకు చాలా సినిమాలలో హీరోయిన్ గా నటించింది. కానీ ఈమె నటించిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని ఆదుకోలేదు.

కావ్య కొంత కాలం క్రితం ఏక్ మినీ కథ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించిన ఈ మూవీ నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ విడుదల అయ్యింది. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈమె డబల్ ఇస్మార్ట్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో రామ్ పోతినేని హీరోగా నటించగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం ఈ మూవీ.లో తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ప్రస్తుతం ఈమె గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వం అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.

మూవీ నుండి విడుదల అయిన పోస్టర్లలో కూడా ఈ ముద్దుగుమ్మ చాలా హాట్ గా కనపడుతుంది. మరి ఈ సినిమా నైనా మంచి విజయం సాధిస్తే కావ్య కు తెలుగులో సూపర్ క్రేజ్ లభించే అవకాశం ఉంటుంది. లేక ఈమెకు ఈ మూవీ ద్వారా కూడా అపజయం దక్కినట్లు అయితే ఈమె కెరియర్ గ్రాఫ్ పడిపోయా అవకాశం ఉంది. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి సినిమాలు చేసి ఏ రేంజ్ సక్సెస్ లను ఈ బ్యూటీ అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: