తెలుగు సినీ పరిశ్రమలో ఫుల్ స్పీడ్ గా స్టార్ దర్శకుల స్థాయికి ఎదిగిన వారిలో కొరటాల శివ ఒకరు. ఈయన ఆఖరుగా ఆచార్య సినిమాకు దర్శకత్వం వహించాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమాకు ఘోరమైన నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద అపజయాన్ని అందుకుంది. ఇక కొరటాల శివ కెరియర్ లోనే ఇది మొదటి అపజయం.

ఆచార్య సినిమా అపజయంతో కొరటాల శివ మళ్లీ అలాంటి రిజల్ట్ రాకూడదు అని అనేక తగిన జాగ్రత్తలు తీసుకొని చాలా కాలం పాటు ప్రీ ప్రొడక్షన్ పనులను చేసి ఎన్టీఆర్ హీరోగా దేవర సినిమాను మొదలు పెట్టాడు. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుండగా మొదటి భాగాన్ని మొదటగా ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక సెప్టెంబర్ 27 వ తేదీన "ఓజి" విడుదల తేదీని చాలా రోజుల క్రితం ప్రకటించారు. ఇక ఆ సినిమా పోస్ట్ పోన్ కావడంతో ఈ దేవర మూవీ ని ప్రీ పోన్ చేసి సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

కొరటాల ఈ సినిమాను ప్రీ ప్రోన్ చేయడం ఈ మూవీ కి చాలా కలిసి వచ్చింది. ఎందుకు అంటే అక్టోబర్ నెలలో అనేక సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. ఇక సెప్టెంబర్ 27 వ తేదీకి దగ్గరలో ఏ పెద్ద సినిమా కూడా రిలీజ్ కు లేదు. దానితో దేవర మూవీ కి మంచి టాక్ వచ్చినట్లయితే అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను ప్రపంచవ్యాప్తంగా కొల్లగొట్టే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇక దేవర మూవీ ని ప్రీ ఫోన్ చేయడంపై ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: