పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని సంవత్సరాల క్రితం గబ్బర్ సింగ్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... హరీష్ శంకర్మూవీ కి దర్శకత్వం వహించాడు. బండ్ల గణేష్ నిర్మించిన ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మరో భారీ విజయాన్ని అందుకోగా , హరీష్ శంకర్ , శృతి హాసన్ , బండ్ల గణేష్ కు ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది.

ఇకపోతే ఆ సమయంలో అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమాను కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రి రిలీజ్ చేయగా మళ్లీ ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్లు రీ రిలీజ్ లో భాగంగా కూడా వచ్చాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ దర్శకుడు అయినటువంటి హరీష్ శంకర్ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ ... పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో నాకు నేనే పోటీ నాతో నాకే పోటీ అనే డైలాగ్ చెప్పమని అన్నాను. దానితో పవన్ కళ్యాణ్ ఆలోచించారు. నాకు నేనే పోటీ నాతో నాకే పోటీ ఇలాంటి డైలాగులు ఎందుకు ... అవసరమా అన్నారు. కానీ సినిమాకు అవసరం సార్ అన్నాను. దానితో వెంటనే ఆయన మరో మాట మాట్లాడకుండా ఆ డైలాగ్ చెప్పాడు. పవన్ కళ్యాణ్ దర్శకుడు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తాడు అని హరీష్ శంకర్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: