మాస్ మహారాజా రవితేజ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం ఇడియట్ అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా రవితేజ , పూరి జగన్నాథ్ కు సూపర్ సాలిడ్ క్రేజ్ లభించింది. ఇకపోతే ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన ఎడిటర్లలో ఒకరు అయినటువంటి మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్ గా పని చేశారు. ఇకపోతే తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఇడియట్ మూవీ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలను చెప్పుకొచ్చాడు.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా మార్తాండే కే వెంకటేష్ మాట్లాడుతూ ... రవితేజ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇడియట్ సినిమాకు సంబంధించిన ఎడిటింగ్ చేస్తున్న సమయంలో సినిమా అంతా బాగానే ఉంది. కానీ సినిమా మొత్తం చాలా సీరియస్ గా ముందుకు వెళుతుంది. మధ్యలో ఏదైనా చిన్న కామెడీ ట్రాక్ ఉంటే బాగుంటుంది. సినిమా మొత్తం అలా సీరియస్ గా వెళితే ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది అని పూరి జగన్నాథ్ తో అన్నాను. ఆ తర్వాత ఆయన సినిమా మొత్తం సీరియస్ గానే ముందుకు వెళుతుంది.

కాబట్టి మధ్యలో ఏదైనా కామెడీ ట్రాక్ పెడితే బాగుంటుంది అని ఉద్దేశానికి వచ్చాడు. దానితో ఆలీ ట్రాక్ ను చిత్రీకరించి ఆ తర్వాత దానిని సినిమాలో యాడ్ చేశారు. ఆ ట్రాక్ సూపర్ సక్సెస్ అయ్యింది. సినిమా కూడా అద్భుతమైన విజయం అందుకుంది. అలా సినిమా మొత్తం పూర్తి అయిన తర్వాత ఇడియట్ సినిమాలో ఆలీ ట్రాక్ ను చిత్రీకరించి చేర్చాలని తాజాగా ఇడియట్ మూవీ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: