మరోసారి నాని సినిమాకు మంచి టాక్ వచ్చిన నష్టాలు తప్పేలా లేవు. వినాయక చవితి వరుసగా రెండు రోజులు సెలవులు .. అందుకే ఈ వీకెండ్తో గట్టిఎక్కేస్తామని సరిపోదా శనివారం బయ్య‌ర్లు ధీమాగా ఉన్నారు .. కానీ ఈ శనివారం కాస్త శనివారం సినిమాను నిరాశపరిచింది. ఉదయం చవితి పూజలు మధ్యాహ్నం నుంచి వర్షాలు దెబ్బసాయి. నైజాం వరకు సినిమా కలెక్షన్లు మంచిగా వచ్చాయి. సేమ్ టు సేమ్ నాని దసరా సినిమా మాదిరిగానే నైజాం డబ్బులు తెచ్చింది. ఏపీ - సీడెడ్ బయర్లు అందరూ నష్టపోయారు. ఇప్పుడు కూడా నైజాం ఓకే ... వైజాగ్ పర్వాలేదు ... కానీ మిగిలిన ఈస్ట్ - వెస్ట్ - కృష్ణ - గుంటూరు - నెల్లూరు అందరికీ జీఎస్టీలు ఇచ్చినా కూడా అంతో ఇంతో నష్టమే తప్ప ఖర్చులు .. కమీషన్లు గిట్టుబాటు కావడం కష్టమే అని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.


సీడెడ్ లో అయితే మరి దారుణం రెండు కోట్లకు పైగా నష్టం అంటున్నారు. దగ్గర దగ్గర 5:30 కోట్లు ఇచ్చి కొన్నారు. మూడు కోట్లు రావడం కూడా కష్టం అని తేలిపోయింది. ఇలా ఉంటే హోల్సేల్ బయ్యర్ దిల్ రాజు జిఎస్టి లు ఇచ్చుకోవాలి ... ఇప్పుడు సుమారు రు. 5 కోట్ల మేర వెన‌క్కు ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల దిల్ రాజుకు కూడా పెద్దగా కలిసి వచ్చేది ఉండదు. రు. 25 కోట్లు పెట్టి థియేటర్ హక్కులు ఏపీ - తెలంగాణ లో తన దగ్గర ఉంచుకున్న ఏరియాల లో కలెక్షన్లతో కలిపి లెక్క వేసుకున్న రు. 25 కోట్లకు బొటాబొటీ గానే వచ్చింది.. ఇప్పుడు జీఎస్టీ తను ఇచ్చుకోవాలి.. ఆంధ్ర అంతటా జోరుగా వర్షాలు పడుతున్నాయి.


అసలు రెండో వారం సరైన పెద్ద సినిమా పడలేదు. పడి ఉంటే పరిస్థితి మరీ ఇబ్బందిగా ఉండేది మరోవైపు 35 సినిమా మెల్లమెల్లగా మల్టీప్లెక్స్ లలో పికప్ అవుతుంది. ఏది ఏమైనా మరోసారి నాని సినిమాల వల్ల బయ్యర్లకు కష్టమే వచ్చింది. నష్టమే మిగిలింది.. గ‌తంలో నాని సినిమాల‌కు కాస్ట్ ఫెయిల్యూర్ అంటే నిర్మాతల చేత మొహమాటంగా ట్వీట్లు వేయించారు. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: