మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంతో కొత్త రికార్డులకు తెరలేపాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఇంకా రిలీజ్‌కి 20 రోజుల సమయం ఉండగానే దేవర రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా ఓవర్సీస్‌లో దేవర ర్యాంపేజ్ మామూలుగా లేదు.ఈ సినిమా ప్రీ-సేల్స్‌తోనే సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. యూఎస్‌లోనే ఫాస్టెస్ట్ 20వేల టికెట్లు అమ్ముడైన ఇండియన్ సినిమాగా ఇది సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి.ఈ సినిమాలో జాన్వీ కపూర్

 హీరోయిన్‌గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా దేవర' నుంచి  'దావూదీ' పాట రిలీజైన సంగతి తెలిసిందే. మామూలుగా క్రేజీ మూవీస్ నుంచి కొత్త పాటలేవైనా రిలీజ్ చేస్తే.. అవి లిరికల్ వీడియోలుగానే ఉంటాయి. మధ్య మధ్యలో చిన్న చిన్న స్టెప్స్ చూపించి.. మిగతా ఫొటోలు, లిరిక్స్‌తో మేనేజ్ చేస్తారు. పాటలో మేజర్ హైలైట్స్ అనిపించే వాటిని దాచి ఉంచుతారు. కానీ 'దావూది' పాట విషయంలో మాత్రం దీనికి భిన్నంగా జరిగింది. దాదాపు మూడు నిమిషాల నిడివితో వీడియో సాంగ్ రిలీజ్ చేసేశారు.

ఇంత పెద్ద సినిమా నుంచి ముందే ఇలా వీడియో సాంగ్ రిలీజ్ చేసేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. థియేటర్లో సర్ప్రైజ్ చేయకుండా ముందే ఇలా మొత్తం ఎందుకు చూపించేశారన్నది అర్థం కాలేదు. ఐతే దీని వెనుక వేరే కారణం ఉందని వెల్లడైంది. దావూదీ పాట సినిమాలో ఉండదట. ఈ పాటను ప్లేస్ చేయడానికి సరైన సందర్భం కుదరలేదట. దీంతో సినిమా ముగిశాక ఈ సాంగ్‌ను రోలింగ్ టైటిల్స్‌లో వేస్తారట. సినిమాలో లేని పాట, పైగా రోలింగ్ టైటిల్స్ అందరూ చూడరు కాబట్టి.. ముందే ఈ పాటను యూట్యూబ్‌లో రిలీజ్ చేసేశారట...!!

మరింత సమాచారం తెలుసుకోండి: