యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ నటించిన 'దేవర' 2024 మోస్ట్‌ ఎవైటెడ్‌ సినిమాల్లో ఒకటి. పాటలు విడుదలైన తర్వాత ఈ చిత్రం అంచనాలను భారీగా పెంచుతోంది. దేవర చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నిజానికి దేవ‌ర‌కు వేరొక సినిమా ఏదీ పోటీకి రావ‌డం లేద‌ని భావించారు.. కానీ ఇప్పుడు కార్తీ మాత్రం ఎన్టీఆర్‌తో ఢీకొట్టేందుకు రెడీ అవుతున్నాడు. త‌మిళనాడులో దేవ‌ర‌కు కార్తీ న‌టించిన సినిమా పోటీకి రానుంది.కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో, దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మెయియజగన్ చిత్రం తెలుగులో సత్యం సుందరంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదే విషయాన్ని మేకర్స్ తాజాగా సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. కార్తీ మరియు అరవింద్ స్వామి కలిసి ఉన్న ఈ పోస్టర్ ప్రేక్షకులను అలరిస్తుంది.కార్తీ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'సత్యం సుందరం'. ఈ సినిమా స్పెషాలిటీ ఏమిటంటే... కార్తీక్ సోదరుడు, తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న తమిళ కథానాయకుడు సూర్య, జ్యోతిక దంపతులు తమ 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద ప్రొడ్యూస్ చేస్తున్నారు. కార్తీకి సొంత సినిమా లెక్క. అరవింద్ స్వామి మరో మెయిన్ లీడ్ చేసిన సత్యం సుందరం సినిమాపై తమిళనాట మంచి అంచనాలు ఉన్నాయి.

అయితే... తెలుగులో ఈ సినిమాకు గట్టి పోటీ ఉందని చెప్పాలి.సెప్టెంబర్ 27 అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులకు గుర్తుకు వచ్చేది ఒక్కటే... 'దేవర'. ఇప్పుడు ఈ సినిమాతో పాటు ఆ రోజున మరో సినిమా కూడా రానుంది. తెలుగు ప్రేక్షకులకు సైతం తెలిసిన తమిళ కథానాయకుడు కార్తీ, అరవింద్ స్వామి నటించిన 'సత్యం సుందరం' వస్తోంది.ఈ చిత్రాన్ని తెలుగులో 'సత్యం సుందరం' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇటీవలే ఘనంగా జరిగింది. దీంతో దేవ‌ర వ‌ర్సెస్ స‌త్యం సుంద‌రం ఫైట్ ఇప్పుడు అధికారికంగా మారింది. ఈ చిత్రానికి సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. కార్తీ- అరవింద్ స్వామి కలయికలో ఇది వ‌స్తోంది. సూర్య, జ్యోతిక తమ 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమాని నిర్మించారు. దేవర కూడా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల చేయాలనే లక్ష్యంతో ఉంది. కాబట్టి దాని తమిళ వెర్షన్‌కి తమిళనాడులో డైరెక్ట్ క్లాష్ ఉంటుంది. గతంలో ఎన్టీఆర్ చేసిన ఆర్ఆర్ఆర్ త‌మిళ‌నాడులోను విజయం సాధించ‌డంతో దేవరకు త‌మిళ‌ రాష్ట్రంలో కూడా క్రేజ్ ఉంది. దేవర ట్రైలర్ కూడా సెప్టెంబర్ 10 న విడుదల అవుతుంది. ప్రస్తుత క్లాష్ లో తంబీల రాష్ట్రంలో దేవ‌ర ప‌రిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. తెలుగు రాష్ట్రాల వ‌ర‌కూ ఎవ‌రూ ఎన్టీఆర్ హ‌వాను ఆప‌డం అసాధ్యం. ఇక ఓవ‌ర్సీస్ లోను దేవ‌ర‌కు అద్భుత‌మైన క్రేజ్ నెల‌కొంద‌ని ఇప్ప‌టికే టికెట్ ప్రీసేల్ చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: