ఒకప్పుడు ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపిన హీరోయిన్లలో రంభ ఒకరు.. ఈమె బాలీవుడ్,  టాలీవుడ్,కోలీవుడ్,మాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో వరుస సినిమాలు చేసింది.అలా అప్పట్లో రంభ క్రేజ్ మామూలుగా ఉండేది కాదు.. ఈమె అందానికి అప్పట్లో చాలామంది ఫిదా అయిపోయారు. రాంగోపాల్ వర్మ లాంటి వారే ఈమె అందానికి ఫిదా అయ్యారంటే రంభ అందం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ కి అవకాశాలు తగ్గాక కెనెడాకి చెందిన వ్యాపారవేత్తని పెళ్లి చేసుకొని కెనడాలో సెటిల్ అయింది. ఈమెకు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉన్నారు.అయితే గతంలో రంభ తన భర్తకు విడాకులు ఇచ్చేసి ఇండియాకి వచ్చిందనే టాక్ మీడియాలో తెగ వైరల్ అయింది.దానికి ప్రధాన కారణం ఎప్పుడూ కెనడాలోనే ఉండే రంభ గత కొద్ది సంవత్సరాల ముందు ఎక్కువగా ఇండియాలోనే కనిపించింది. 

దాంతో భర్తతో రంభకి గొడవలై అందుకే ఇండియాకి వచ్చేసిందనే టాక్ ఎక్కువగా వినిపించింది. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని కూడా నిర్ణయించుకొని కోర్టులో పిటిషన్ కూడా వేసిందట.అయితే రంభ భర్త ఇంద్రన్ కి అంతకుముందే మరో మహిళతో పెళ్లయిందని,ఈ విషయం దాచిపెట్టి పెళ్లి చేసుకున్నాడని చెప్పిందట. అంతేకాదు బిజినెస్ మాన్ అయినా ఇంద్రన్ తన కంపెనీకి రంభని బ్రాండ్ అంబాసిడర్ గా చేసి ఆమెతో మోడల్స్ చేసే పనిని చేయిద్దామని అనుకున్నారట.అయితే సహజంగానే రంభ హీరోయిన్ కాబట్టి తన కంపెనీకి రంభ ని మోడల్ గా చేసి పొట్టి పొట్టి బికినీలు వేయిద్దాం అనుకున్నారట.

 ఇక ఇదే విషయాన్ని రంభకు చెప్పగా నీకు సిగ్గులేదా భార్యని అందరి ముందు బికినీలు వేసుకొని తిరుగమంటున్నావ్ అని రంభ కోపంగా అరిచిందట. కానీ ఆయన మాత్రం ఏ నువ్వు సినిమాలో చేయలేదా..ఇప్పుడు మన కంపెనీ కోసమే కదా చేసేది అని చెప్పారట. కానీ ఈ విషయంలో ఇద్దరికీ గొడవలు వచ్చి రంభ ఇండియా కి వచ్చేసిందనే టాక్ అప్పట్లో గట్టిగా వినిపించింది. కానీ రంభ విడాకుల వార్తలు వైరల్ అయ్యాక నేను ఎలాంటి విడాకులు తీసుకోవడం లేదు మీడియా ఇలా తప్పుగా రాయకండి అని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: