శ్రీ లీల... స్టార్ హీరోయిన్. అతి చిన్న వయసులో స్టార్ స్టేటస్ అందుకున్న హీరోయిన్, ఆ మాటకు వస్తే తెలుగు అమ్మాయి కూడా ఈ అందాల భామ అని చెప్పాలి. 'పెళ్లి సందD'తో శ్రీ లీల తెలుగు చిత్రసీమలో కథానాయికగా అడుగు పెట్టారు. అయితే... అప్పటికే ఆవిడ కన్నడలో సినిమాలు చేశారు. 'పెళ్లి సందD' తర్వాత శ్రీ లీల వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస సినిమాలు చేశారు. ఇప్పుడు ఆవిడకు హిందీ, తమిళ సినిమా అవకాశాలు వస్తున్నాయి. త్వరలో తమిళ తెరకు శ్రీ లీల పరిచయం కానున్నారని సమాచారం. శివ కార్తికేయన్ సినిమాతో తమిళ తెరకు శ్రీ లీల. తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన తమిళ

 కథానాయకుడు శివ కార్తికేయన్. 'రెమో', 'వరుణ్ డాక్టర్', 'డాన్' సినిమాలతో తెలుగులోనూ ఆయన విజయాలు అందుకున్నారు. 'జాతి రత్నాలు' ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వంలో 'ప్రిన్స్' సినిమా చేశారు. ఇప్పుడు ఆయనకు జంటగా తమిళ చలన చిత్ర పరిశ్రమకు శ్రీ లీల పరిచయం అవుతున్నారని సమాచారం. ఇదిలాఉంటే శ్రీలీల  ఒక ఫ్లాప్ సినిమా నుంచి తప్పించుకుందని తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో వచ్చిన గోట్  సినిమా ఈమధ్యనే రిలీజైంది. ఈ సినిమాలో త్రిష  ఒక స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసింది. ఈ సాంగ్ కి ముందు శ్రీ లీలని అనుకున్నారు స్టార్ సినిమా అంటే నో చెప్పకుండా

 చేయాల్సి ఉన్నా కూడా శ్రీలీల మాత్రం అందుకు నిరాకరించింది.  ఐతే విజయ్ గోట్ సినిమా ఆఫర్ కాదన్న శ్రీలీల గుడ్ డెసిషన్ అంటున్నారు. శ్రీలీల కెరీర్ ప్రస్తుతం డైలమాలో ఉంది. తెలుగులో కేవలం నితిన్ సినిమా ఒకటి మాత్రమే చేతిలో ఉంది. ఐతే స్టార్ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్న శ్రీలీల అందులో మాత్రం వెనకబడి ఉంది. ఇక విజయ్ గోట్ సినిమాలో స్పెషల్ సాంగ్ కాబట్టి అమ్మడు కాదన్నదని తెలుస్తుంది. తమిళ సినిమాల్లో లీడ్ హీరోయిన్ ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంది శ్రీలీల...!!

మరింత సమాచారం తెలుసుకోండి: