నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో తాజాగా 2 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది. నాని కెరీర్ లోనే అత్యంత వేగంగా 2 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిన చిత్రంగా సరిపోదా శనివారం చిత్రం నిలిచింది. హీరో నాని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ హిట్స్ సాధించడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో విలక్షణ నటుడు ఎస్ జే

 సూర్య విలన్ పాత్రలో నటించాడు. జేక్స్ బెజోయ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మించాడు. ప్రస్తుతం థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోన్న సరిపోదా శనివారం కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. అదేంటంటే.. నాని మరికొన్ని రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుందట. సరిపోదా శనివారం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. సాధారణంగా థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీ లోకి రావాలని నిబంధనలు ఉన్నాయి. కానీ సరిపోదా శనివారం మూవీ విషయంలో

మాత్రం థియేట్రికల్ రిలీజ్ తర్వాత నాలుగు వారాలకే స్ట్రీమింగ్ కి తీసుకొచ్చేలా డీల్ జరిగిందని వినిపిస్తున్నాయి. ఆ లెక్కన చూసుకుంటే సెప్టెంబర్ 27వ తేదీ నుంచే ఈ ఓటీటీలోకి వస్తోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం నాని కు కలెక్షన్లు ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా ఇప్పుడు పోటీగా పెద్ద లు కూడా లేవు. కాబట్టి సరిపోదా శనివారం మరికొన్ని రోజుల పాటు ఇదే రన్ ను కొనసాగించవచ్చు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: