యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. రీసెంట్ గా బబుల్ గమ్ మూవీలో హీరోగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టును కూడా అందుకుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరి విజనరీ ప్రొడ్యూసర్ తీసి విశ్వ ప్రసాద్ ఎక్సయిటింగ్ న్యూ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. తన తొలి చిత్రం కలర్ ఫోటోతో జాతీయ అవార్డును గెలుచుకున్న దర్శకుడు సందీప్ రాజ్, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ కోసం యంగ్ ట్యాలెంటెడ్ రోషన్ కనకాలతో కలిసి పని చేయబోతున్నారు.

 ఈ సినిమాకు 'మోగ్లీ' అనే టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో రోషన్ కనకాల యూనిక్ రోల్లో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలోని ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రోషన్ కనకాల వెస్ట్ ధరించి, సాలిడ్ ఫిజిక్, దట్టమైన అడవిలో గుర్రంతో పాటు చిరునవ్వుతో  కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది. విజువల్ గా పోస్టర్ కట్టిపడేసింది. అయితే మోగ్లిని 2025 సమ్మర్ లో విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.

కలర్ ఫోటోకు సక్సెస్ఫుల్ ఆల్బమ్ అందించిన కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. బాహుబలి 1&2, rrr వంటి బ్లాక్ బస్టర్ ప్రాజెక్టులకు చీఫ్ అసోసియేట్ సినిమాటోగ్రాఫర్ రామ్ మారుతి M, సినిమాటోగ్రఫిని నిర్వహిస్తారు. కలర్ ఫోటో, మేజర్, అప్ కమింగ్ గూఢచారి 2 హిట్ చిత్రాలకు ఎడిటర్ అయినా పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి ఎడిట్ చెయనున్నారు. కాగా, యాంకర్ సుమ కొడుకు అయిన రోషన్ కనకాల బబుల్ గమ్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమా విజయం సాధించినప్పటికీ ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమా ప్రేక్షకులనే బాగా మెప్పించింది. ఇక ఈ సినిమా రొమాంటిక్ యాంగిల్ లో కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: