లేటెస్ట్ గా విడుదలైన ‘గోట్’ తెలుగు రాష్ట్రాలలో డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో ఈమూవీ ఊహించిన స్థాయిలో విజయవంతం కాలేదు అన్న సంకేతాలు వస్తున్నాయి. ఈమూవీ మొదటిరోజు మొదటి షో నుండి నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో తెలుగు రాష్ట్రాలలో ఈమూవీ బయ్యర్లకు భారీ నష్టాలు వచ్చే ఆస్కారం ఉంది.


విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం క్లైమాక్స్ అయిన తరువాత  హాలీవుడ్ తరహాలో ఎండ్ టైటిల్స్ వచ్చాయి. అయితే ఆతరువాత ఎవరు ఊహించని విధంగా విజయ్ పోషించిన నెగిటివ్ పాత్రకు చిన్న ట్విస్ట్ ఇచ్చి ఈమూవీకి సీక్వెల్ ఉండబోతోంది అన్న సంకేతాలు దర్శకుడు ఇచ్చాడు. అంతేకాదు ‘గోట్’ వర్సెస్ ఓజి అన్న కార్డు వేసి అందరికీ షాక్ ఇచ్చారు.


వాస్తవానికి పవన్ కళ్యాణ్ డాన్ గా నటిస్తున్న ‘ఓజీ’ మూవీ ఈపాటికే విడుదల కావలసి ఉంది. అయితే పవన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చాల బిజీగా ఉండటంతో ఈమూవీ విడుదల ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. అయితే ఈమూవీకి దర్శకుడు సుజిత్ పెట్టిన టైటిల్ తో పాటు ఈమూవీ టీజర్ కు విపరీతమైన స్పందన రావడంతో పవన్ అభిమానులు ఈమూవీ విడుదల గురించి ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఈమధ్య తమిళనాడులో ‘గబ్బర్ సింగ్’ మూవీని రీ రిలీజ్ చేసినప్పుడు తమిళనాడులోని పవన్ అభిమానులు బాగా చూడటంతో తమిళ ప్రేక్షకులలో పవన్ కు ఉన్న మ్యానియా అందరికీ మరొకసారి తెలిసింది.


ప్రస్తుతం దర్శకుడు వెంకట ప్రభు తెలుగు రాష్ట్రాలలో పవన్ కు ఉన్న మ్యానియాను దృష్టిలో పెట్టుకుని ‘గోట్’ మూవీలో ‘ఓజీ’ ప్రస్తావన తీసుకు వస్తే పవన్ అభిమానూలు అంతా ‘ఓజీ’ సినిమాను సూపర్ హిట్ చేస్తారు అన్న అంచనాలు పెద్దగా వర్కౌట్ కాలేదు అన్న అభిప్రాయాలు ఈమూవీ ఫలితాన్ని విశ్లేషణ చేస్తున్నవారికి అనిపిస్తోంది. మరొకవైపు త్వరలో రాబోతున్న తమిళనాడు ఎన్నికలలో విజయ్ పార్టీ పోటీ చేస్తున్న పరిస్థితుల్లో ఈమూవీ ఫలితం విజయ్ కు పెద్ద షాక్ అనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: