టాలీవుడ్ లో ఎలాంటి పెద్ద హీరో అయినా.. ఎంత గొప్ప హీరో అయిన.. ఒక్కసారి దర్శకధీరుడు రాజమౌళి చేతుల్లోకి వెళితే.. ఇక ఏదైనా ఆయన చెప్పినట్టు జరగాల్సిందే. ఆయన చెప్పినట్టు వినాల్సిందే. కేవలం సినిమాకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు.. బయట ఏ కార్యక్రమం జరిగిన.. దానికి రాజమౌళి పర్మిషన్ కావల్సిందే. ఎందుకంటే హీరోల మేకోవ‌ర్‌ బయటపడతాయి అన్నది రాజమౌళి టెన్షన్. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ది కూడా అదే పరిస్థితి. రాజమౌళితో కలిసి సెట్స్‌పైకి వెళ్లేందుకు మహేష్ బాబు రెడీ అవుతున్నారు.


దర్శకుడు సూచనల మేరకు మేకోవర్ కూడా ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి రీసెంట్ గా కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. లేటెస్ట్ లుక్ లో మహేష్ బాబు కాస్త కండబట్టారు. గడ్డం జుట్టు కూడా పెంచాడు. ఈ లుక్ ఫైనల్ గా రాజమౌళి లాక్ చేయాల్సి ఉంది. ఇలాంటి టైం లో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన భారీ పాన్ ఇండియా సినిమా దేవర ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ త్వరలో జరగనుంది. ఈ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్యఅతిథిగా వస్తారు అనే ప్రచారం సాగుతోంది.


ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ మహేష్ బాబుకు అత్యంత సన్నిహితుడు. గతంలో మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలకు కొరటాల దర్శకుడు. కొరటాల అంటే మహేష్ బాబుకు ఎంతో ఇష్టం. ఇప్పుడు దేవర సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వటం కొరటాలకు అత్యంత ప్రతిష్టాత్మకం. కొరటాల కెరీర్ కు చాలా ఇంపార్టెంట్. తనకు రెండు సూపర్ హిట్లు ఇచ్చాడు అన్న కృతజ్ఞతతో మహేష్ బాబు.. దేవర సినిమాకు ముఖ్య అతిథిగా వచ్చేందుకు ఓకే చెప్పాడట. అయితే కచ్చితంగా వస్తాడా.. రాడా.. అన్న సందేహం ఉంది.


ఇటు కొరటాల శివ కానీ.. మహేష్ బాబు రావాలంటే రాజమౌళి పర్మిషన్ తప్పకుండా కావాలి. చాలా ఏళ్ల కిందట మహేష్, ఎన్టీఆర్ కలిసి ఒకే వేదిక మీద కనిపించారు. మళ్లీ ఇన్ని సంవత్సరాలకు దేవర ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో వీళ్ళిద్దరూ కలుస్తారని ప్రచారం సాగుతోంది. రాజమౌళి అభ్యంతరం లేకపోతే ఎన్టీఆర్, మహేష్ బాబు మరోసారి కలవడం పక్క.

మరింత సమాచారం తెలుసుకోండి: