టాలీవుడ్‌లో సీనియర్ హీరోలు, స్టార్ హీరోలు ఎప్పుడు వరుస పెట్టి మల్టీ స్టార‌ర్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.. ఒక స్టార్ హీరో.. మరో స్టార్ హీరో లేదా సీనియర్ హీరోతో కలిసి కనిపించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలు చేసి ఈ తరం జనరేషన్‌లో సరికొత్త రికార్డు నమోదు చేసుకున్నారు. వెంకటేష్ స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్ తోను.. ఇటు మహేష్ బాబు తోను.. కుర్ర హీరోలు రామ్, వరుణ్ తేజ్ తోను మల్టీస్టారర్ సినిమాలు చేశారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో ఎవ్వరు ఊహించని విధంగా అదిరిపోయే క్రేజీ మల్టీ స్టార‌ర్ తెరకెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది.


ఆ క్రేజీ కాంబినేషన్ ఎవరిదో కాదు.. నందమూరి నట‌సింహం బాలకృష్ణ, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. అసలు వినటానికి ఈ కాంబినేషన్ అదిరిపోతుంది. నిజంగా తెరకెక్కితే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ థ‌మన్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. తాను మహేష్ బాబు - బాలకృష్ణ కాంబినేషన్లో తెర‌కెక్కే సినిమా కోసం పని చేస్తున్నానని.. థ‌మన్‌ స్వయంగా ఈ విషయం చెప్పడంతో.. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ లో సెన్సేషనల్ గా మారింది.


ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ వరల్డ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి బాలకృష్ణ ఈ సినిమాలోనే నటిస్తారా.. లేదా.. ఈ సినిమా పూర్తయ్యాక బాలయ్య, మహేష్ బాబు మల్టీస్టారర్ సినిమా ఉంటుందా ? అన్నది క్లారిటీ అయితే లేదు. ఎక్కువ మంది చెబుతున్న దాని ప్రకారం మహేష్ బాబు - రాజమౌళి సినిమాలోని బాలయ్య ఓ కీలకపాత్రలో కనిపిస్తారని. ఆ పాత్ర సినిమాలో సెకండ్ హాఫ్ లో వస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా బాలయ్య, మహేష్ బాబు కలిసి తెరపంచుకున్నారంటే.. అది కచ్చితంగా టాలీవుడ్ లో రికార్డుల దుమ్ము దులపటం ఖాయం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: