టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా కోసం అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో లైఫ్ అండ్ డెప్త్ గా మారిపోయింది. ఈ సినిమా సక్సెస్ అయితే కొరటాల శివ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు పొందుతారు. లేకపోతే సినిమా అవకాశాలు వచ్చేలా కనిపించడం లేదు. దేవర సినిమా ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకి పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతోంది.


జూనియర్ ఎన్టీఆర్కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తున్నది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో మొదటిసారి టాలీవుడ్ లో నటిస్తున్నారు. అలాగే మరి కొంత మంది కీలకమైన పాత్రలో నటీనటులు నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్, పోస్టర్లు సైతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా చిత్ర బృందం వేగవంతం చేస్తోంది ఈనెల 10వ తేదీన దేవర సినిమాకు సంబంధించి ప్లీజ్ ఈ వెంటనే చేయబోతున్నారట. అది కూడా ముంబై ప్రాంతంలో చేయబోతున్నట్లు సమాచారం.


దేవర సినిమా ట్రైలర్ ని కూడా చిత్ర బృందం అక్కడే స్టార్ హీరో అయిన మహేష్ బాబు, ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, కలిసి ఒకే వేదిక పై కనిపించారు. కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పిలవడంతో మహేష్ బాబు కూడా ఈ చిత్రానికి సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రాబోతున్నారట. అంతేకాకుండా కొరటాల శివ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు మహేష్ కథ కెరియర్ లో వేయడంతో మంచి స్నేహబంధం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ బంధం కారణంగానే మహేష్ బాబు అతిథిగా దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాబోతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: