సునీతను మోసం చేయడం ఏంటి..? అందులో టీడీపీ మాజీమంత్రి ఎవరు..? అసలు సునీత ఎవరు..? ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఏంటి..? ఆ స్టోరీ ఏంటి..? తెలుసుకోవాలని అనుకుంటున్నారా. ఇందులో చాలా చిత్రవిచిత్రాలు, ట్విస్టులు ఉంటాయి. సునీత అంటే పరిటాల సునీత కాదు.. వైసీపీ తాజా మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత. 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి ప్రకాశం జిల్లా, ఇప్పుడు బాపట్ల జిల్లాలోని చీరాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే చంద్రబాబు.. ఆమె మీద ఉన్న గౌరవంతో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు.. బీసీ మహిళ నేత కావడంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నియమించారు.


అయితే 2019లో పార్టీ ఓడిపోయిన వెంటనే సునీత తెలుగుదేశం పార్టీని తీవ్రంగా విమర్శించి.. పైగా చంద్రబాబు, లోకేష్ తో పాటు నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి పై సైతం విమర్శలు చేసి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు వైసీపీ ఓడిపోవడంతో తిరిగి టీడీపీలోకి వచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు ఆమె తెలుగుదేశం పార్టీలో తీసుకునేందుకు చాలా మంది ఇష్టపడటం లేదు. భువనేశ్వరి, బ్రాహ్మణి పై సైతం తీవ్ర విమర్శలు చేయడం చాలా మందికి నచ్చలేదు.


టీడీపీలోను.. మాజీ మంత్రి సూచనలతోనే ఆమె వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి ఉన్నట్టుండి రాజీనామా చేశారని అంటున్నారు. నేనున్నా.. నువ్వు రాజీనామా చెయ్యి.. వెంటనే చంద్రబాబు అపాయింట్మెంట్ ఇప్పిస్తా అని సదరు నాయకుడు సునీతకు చెప్పారట. దీంతో సునీత వెనక ముందు ఆలోచించకుండా తన పదవి వదులుకున్నారు. ఇప్పుడు రాజీనామా చేసి 15 రోజులు అవుతున్న ఇప్పటివరకు ఆమె సంగతి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇదే విషయాన్ని సునీత తన అనుచరుల దగ్గర చెప్పుకుని వాపోయారని తెలిసింది.


విచిత్రం ఏంటంటే ఆమెకు హామీ ఇచ్చిన ఆ మాజీ మంత్రి ఇప్పుడు సునీత ఫోన్ చేసిన లిఫ్ట్ చేయడం లేదట. పైగా చంద్రబాబు నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని.. మీకు వేరే దారి ఉంటే ఆలోచించుకోవాలని మరికొందరు చెబుతున్నారట. దీంతో సునీతకు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అసలు ఎందుకు తాను పదవి వదులుకున్నాను రా దేవుడా.. అని తలలు పట్టుకుంటున్న పరిస్థితి. మరోవైపు చంద్రబాబు విజయవాడ వరదలలో బిజీగా ఉండడంతో.. సునీతతో పాటు ఇలాంటి నేతల గురించి పట్టించుకునే టైం లేకుండా బిజీ బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: