ఒకప్పుడు 200 కోట్ల కలెక్షన్లను సౌత్ హీరోలు సాధించడం అనేది చాలా పెద్ద విషయంగా కనబడేది. ఎక్కువ శాతం 200 కోట్లు , 300 కోట్ల కలెక్షన్లను బాలీవుడ్ హీరోలే రాబట్టుకుంటూ ఉండేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో చాలా వరకు మారాయి. సౌత్ హీరోలు కూడా చాలా తక్కువ కాలంలోనే 200 కోట్ల కలెక్షన్లను వసూలు చేస్తున్నారు. అలాగే ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీ కి సంబంధించిన ఎన్నో సినిమాలు 1000 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఇప్పటి వరకు 200 కోట్ల క్లబ్ లోకి చేరిన హీరోలు ఎంతో మంది సౌత్ ఇండస్ట్రీ లో ఉన్నారు. 200 కోట్ల కలెక్షన్లను ఎక్కువ సార్లు రాబట్టిన టాప్ 3 సౌత్ హీరోలు ఎవరు ..? వారు ఎన్ని సినిమాలు తో 200 కోట్ల కలెక్షన్లను రాబట్టారు అనే వివరాలను తెలుసుకుందాం.

తమిళ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ ఇప్పటి వరకు ఏకంగా 8 సినిమాలతో 200 కోట్ల క్లబ్ లోకి చేరాడు. ఈయన నటించిన 8 సినిమాలు 200 కోట్లకు పైగా కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ గద్దర కొల్ల గొట్టాయి.

తమిళ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ కూడా ఇప్పటికే ఎన్నో సినిమాలతో 200 కోట్ల కలెక్షన్లను రాబట్టాడు. రజనీ కాంత్ హీరో గా నటించిన 6 సినిమాలు ఇప్పటి వరకు 200 కోట్ల కలెక్షన్లను వసూలు చేశాయి.

రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తన కెరియర్ లో ఇప్పటికే చాలా సినిమాలతో 200 కోట్ల కలెక్షన్లను వసూలు చేశాడు. ఇకపోతే ప్రభాస్ నటించిన 6 సినిమాలు ఇప్పటి వరకు 200 కోట్ల కలెక్షన్లను రాబట్టాయి.

ఇలా ఈ ముగ్గురు సౌత్ హీరోలు నటించిన ఎక్కువ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర 200 కోట్లకు మించి కలెక్షన్లను రాబట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: