నాచురల్ స్టార్ నాని ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో ఫుల్ జోష్లో దూసుకుపోతున్నాడు. పోయిన సంవత్సరం మొదట నాని "దసరా" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ నాని కెరియర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. ఈ మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న నాని కి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు కూడా లభించింది. పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో నాని "హాయ్ నాన్న" అనే మరో పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సంవత్సరం నాని "సరిపోతా శనివారం" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మూవీ ని కూడా నాని పాన్ ఇండియా మూవీ గానే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ అయింది. ఈ సినిమాకు ప్రస్తుతం లాభాలు వస్తున్నాయి. ఈ మూవీ కి సంబంధించిన 10 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ఇప్పటి వరకు కంప్లీట్ అయింది. 10 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేంజ్ రికార్డును సొంతం చేసుకుంది. అసలు విషయం లోకి వెళితే ... విడుదల అయిన 10 వ రోజు మీడియం రేంజ్ హీరోలలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు లిస్టులో సరిపోదా శనివారం సినిమా 3 వ స్థానంలో నిలిచింది.

విడుదల అయిన 10 వ రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్ట్ లో మొదటి స్థానంలో 7.91 కోట్ల కలెక్షన్లతో హనుమాన్ సినిమా నిలిచింది. ఆ తర్వాత బేబీ సినిమా 3.40 కోట్ల కలెక్షన్లతో 2 వ స్థానంలో నిలిచింది. ఇక సరిపోతా శనివారం సినిమా 2.63 కోట్ల కలెక్షన్లతో 3 వ స్థానంలో నిలిచింది. ఇలా సరిపోతా శనివారం సినిమా 10 వ రోజు కూడా అద్భుతమైన కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: