శ్రీదేవి కి ఇద్దరూ కూతుర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇక మొదటి కూతురు జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక బాలీవుడ్ లోనే మంచి పేరును సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. దేవర మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ లో చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా దేవర:పార్ట్ 1 కోసం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా థియేట్రికర్ విడుదలకు ఈ సినిమా రెడీగా ఉంది. ఐతే, ప్రస్తుతం ఎన్టీఆర్, దేవరాజ్ సినిమా ప్రమోషన్ల కోసం ఈరోజు ముంబైకి వెళ్ళాడు. జాన్వి కపూర్ తో కలిసి ఎన్టీఆర్ కొన్ని ప్రత్యేక ఇంటర్వ్యూలను ఇవ్వనున్నారు. ముంబై నుంచి వచ్చిన అనంతరం అటు తమిళ్ ఇటు తెలుగులో 'దేవర' టీమ్ కొన్ని స్పెషల్ ఈవెంట్స్ ను, ఇంటర్వ్యూస్ ను ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి దేవర సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి.

అనిరుద్ రవిచంర్  సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో ఫైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్ లతో పాటు శ్రీకాంత్ తదితరులు కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు. మరి పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా ఏ రేంజ్ నసూళ్లు సాధిస్తుందో చూడాలి. ఇక ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ తీసిన ఏ సినిమా అయినా కానీ హిట్టే అవుతూ వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది ఈ సినిమా. ఈ సినిమాలో జాన్వి కపూర్ చాలా క్యూట్ గా ఉంటుంది. సాంప్రదాయ దుస్తులతో కనిపిస్తుంది. ఎన్టీఆర్ కూడా నల్ల దుస్తులలో కనిపిస్తాడు. ఇక తెలుగులోనే కాదు తమిళ లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: