తమిళ హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ తాజాగా ది గోట్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి సంబంధించిన 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ఇప్పటివరకు కంప్లీట్ అయింది. 3 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి 3 రోజుల్లో తమిళ నాడు ఏరియాలో 80.05 కోట్ల కలెక్షన్లు రాగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8.30 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. కర్ణాటక ఏరియాలో 17.80 కోట్ల కలెక్షన్లు రాగా , కేరళ ఏరియాలో 9.05 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ మూవీ కి మొదటి రోజు 9.10 కోట్ల కలెక్షన్లు రాగా ,  ఓవర్ సీస్ లో 99.65 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ మూవీ కి 3 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 109.80 కోట్ల షేర్ ... 223.95 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 185 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 187 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. 

మూవీ ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ ఫార్ములా అండ్ కంప్లీట్ చేసుకొని హిట్ స్టేటస్ ను అందుకోవాలి అంటే మరో 77.20 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టవలసి ఉంది. మరి ఈ మూవీ ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ మూవీ లో విజయ్ డ్యూయల్ రోల్ లో నటించాడు. ఒక పాత్రలో తండ్రిగాను , మరో పాత్రలో కొడుకు గానూ నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: