‘దేవర’.. టాలీవుడ్ తో పాటుగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తోంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న దేవర సెప్టెంబర్ 27న థియేటర్లలో పూనకాలు తెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్,సాంగ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో దేవరపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమా.. ఇంకా18 రోజుల్లో ఆడియన్స్ ముందుకు రానుంది. దీంతో ఓవర్సీస్‌లో అప్పుడే అడ్వాన్స్ బుకింగ్ మొదలైపోయింది. అలా ఓపెనింగ్స్ మొదలయ్యాయో లేదో గంటల్లోనే టికెట్స్ భారీ లెవెల్‌లో అమ్ముడుపోయాయి. కొన్ని థియేటర్లలో అయితే గతంలోనే హౌస్ ఫుల్ బోర్డ్ కూడా పెట్టేసారట. ఇక అడ్వాన్స్ బుకింగ్స్‌లో దేవరకు వస్తున్న రెస్పాన్స్ పై ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. నెలరోజుల ముందు ప్రి సేల్స్ మొదలుపెడితే ఈ రేంజ్ లో బుకింగ్స్ అంటే ఇక సినిమా రిలీజ్ అయి హిట్ టాక్ వస్తే ఇక సినిమాకు కాసుల వర్షం కురుస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక యూఎస్ లో దేవర క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ఇప్పటికైనా అర్థమయ్యే ఉంటుంది. ఇదే క్రేజ్ సినిమాపై కొనసాగితే ఫ్రీ సెల్ బిజినెస్ లో దేవర సరికొత్త రికార్డ్‌ క్రియేట్ చేయడంలో సందేహం లేదు.

ఇదిలావుండగా దేవర సినిమా తొలిరోజు సులువుగా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దేవర మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుంది. తారక్ అభిమానులు దేవర బెనిఫిట్ షోలను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.ప్రభాస్ నటించిన పాన్ ఇండియా సినిమాలు ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో కొన్ని రికార్డులను సెట్ చేయగా తారక్ సోలో హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తారో చూడాలి. ఆర్ఆర్ఆర్  మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు సైతం భారీ రేంజ్ లో ఉండగా తారక్ మూవీసినిమా కలెక్షన్లను బ్రేక్ చేస్తుందా లేదా అనే ప్రశ్నకు సైతం ఈ నెల 27వ తేదీన సమాధానం దొరకనుంది.దేవర  సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ భవిష్యత్తును నిర్ణయించే సినిమాలలో ఒకటని చెప్పవచ్చు. దేవర నుంచి విడుదలైన ఫియర్ సాంగ్, చుట్టమల్లే సాంగ్ లకు మంచి రెస్పాన్స్ రాగా దావూదీ సాంగ్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. దావూదీ సాంగ్ కు ఇప్పటివరకు 24 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాహ్నవి కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: