సినిమా ఇండస్ట్రీలో కొంత మంది కేవలం నిర్మాణ రంగంలో మాత్రమే ఉంటూ డిస్ట్రిబ్యూషన్ సైడ్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. ఇక మరి కొంత మంది కేవలం డిస్ట్రిబ్యూషన్ చేస్తూ సినిమా నిర్మాణ రంగం వైపు అస్సలు ఆసక్తి చూపరు. కానీ కొంత మంది మాత్రమే ఓ వైపు సినిమాలను నిర్మిస్తూ , మరో వైపు సినిమాలను డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో దిల్ రాజు ఒకరు. దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ రంగం ద్వారానే సినిమా పరిశ్రమలో కెరియర్ను మొదలు పెట్టాడు. ఆ తర్వాతే సినిమాలను నిర్మించడం స్టార్ట్ చేశాడు. ఇకపోతే ప్రస్తుతం దిల్ రాజు ఓ వైపు సినిమాలను నిర్మిస్తూనే మరో వైపు సినిమాలను డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాడు.

ఆయన ఒకే సంవత్సరంలో భారీ మొత్తంలో డిస్ట్రిబ్యూషన్ ద్వారా నష్టాలను చూసినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అసలు విషయం లోకి వెళితే ... తాజా ఇంటర్వ్యూ లో బాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ... డిస్ట్రిబ్యూషన్ రంగం అనేది చాలా పెద్ద ప్రమాదంతో కూడుకున్నది. అందులో లాభాల కంటే నష్టాలే ఎక్కువ. సినిమా హిట్ అయితే చాలా తక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయి. ఆదే సినిమా ఫ్లాప్ అయితే పెద్ద మొత్తంలో డబ్బులు పోతాయి. నేను ఇటు నిర్మాతగా , అటు డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగుతున్నాను కాబట్టే ఇన్ని సంవత్సరాలు సినీ పరిశ్రమలో కొనసాగలుగుతున్నాను. 2017 వ సంవత్సరంలో నేను నిర్మించిన సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి.

అదే సంవత్సరం నేను మహేష్ బాబు హీరోగా రూపొందిన స్పైడర్ , పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన అజ్ఞాతవాసి సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఆ రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. ఆ రెండు మూవీలలో 25 కోట్ల నష్టం వచ్చింది. ఇక నాకు నిర్మాణ రంగంలో వచ్చిన లాభాలతో ఈ నష్టాలను పూడ్చాను అని దిల్ రాజు తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dr