ఇండస్ట్రీలో అద్భుతమైన డైరెక్టర్లలో ఎస్వీ కృష్ణారెడ్డి కూడా ఒకరు.. ఈయన ఎక్కువగా ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు. శుభలగ్నం సినిమా వంటి క్లాసికల్ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకున్నారు. ఈయన సిని కెరియర్ లో.. యమలీల ,మాయలోడు, ఘటోత్గతుడు, రాజేంద్రుడు గజేంద్రుడు వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే ఇటీవల కాలంలో వి కృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఎస్ వి కృష్ణారెడ్డి కొత్త సినిమాలను తెరకెక్కించలేదు. ఇందుకు కారణం సరికొత్త డైరెక్టర్లు విభిన్నమైన కథలను ఎంచుకోవడం వల్లే అని కూడా చెప్పవచ్చు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఎస్వీ కృష్ణారెడ్డి సైతం మాట్లాడుతూ ఇప్పుడు వస్తున్న చిత్రాలపైన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.


అశ్లీలత లాంటి అంశాలు , కుటుంబంతో వెళితే ఇబ్బంది పెట్టే సన్నివేశాలు చాలానే తెరకెక్కిస్తున్నారు వీటి పైన మీ అభిప్రాయం ఏంటి అని యాంకర్ అడగగా.. తన చిత్రంలో కొన్ని రూల్స్ ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను ఎక్కడ కూడా బూతులు తిట్టే సన్నివేశాలు కానీ డైలాగులు కానీ ఉండదని ఆ తర్వాత డబల్ మీనింగ్ డైలాగులు అసలు ఉండవని చివరికి హీరోయిన్ పైట సరిగా లేకపోయినా కొంగు సరిగ్గా లేకపోయినా నేను అసలు ఒప్పుకోను వెంటనే ఆ సీన్ ని కట్ చేస్తానంటూ తెలిపారు.


స్వయంగా తన అసిస్టెంట్నే పంపించి మరి ఈ విషయాలను చెపుతానని తెలిపారు ఎస్ వి కృష్ణారెడ్డి. ఇలా హీరోయిన్స్ విషయంలోనే కాదు అందరి నటీనటుల విషయంలో కూడా తన అభిప్రాయం ఇలానే ఉంటుందని వెల్లడించారు. అయితే ఈ మధ్యన ఒక సినిమా బాగుందని చూద్దామని వెళ్ళగా కానీ ఇంటర్వెల్ కి దండం పెట్టి బయటకి వచ్చేసానని తెలిపారు. మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ పాత్ర ,విలన్ పాత్ర బాగున్నాయని కానీ అది చూడదగిన సినిమా కాదని తెలిపారు కృష్ణారెడ్డి. సినిమా హిట్ అవ్వాలి అంటే కచ్చితంగా థియేటర్లో ఉండే ప్రేక్షకులు 7 నిమిషాలలోపు ఆసక్తి పెరగేలా చేయాలి..

ప్రభాస్ నటించిన సలార్ సినిమా ప్రేక్షకులను బాగా ఎక్సైట్ అయ్యేలా చేసింది. అందులో వెయిట్ ఎంతైనా ఉండొచ్చు కానీ సినిమా మొత్తం ఎంజాయ్ చేశామా లేదా అనేది చూస్తారు. అందుకే సలార్ సక్సెస్ అయింది అంటూ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: