కెరియర్ను ప్రారంభించిన కొత్తలోనే మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో వరుణ్ సందేశ్ ఒకరు. ఈయన హ్యాపీ డేస్ మూవీ తో మంచి విజయాన్ని అందుకొని సూపర్ క్రేజ్ ను తెలుగు సినీ పరిశ్రమలు దక్కించుకున్నాడు. ఇకపోతే ఈ మూవీ తర్వాత ఈ నటుడు కొత్త బంగారు లోకం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కూడా బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఈయన క్రేజ్ తెలుగు లో మరింత గా పెరిగింది. ఇక వరుసగా హ్యాపీ డేస్ , కొత్త బంగారు లోకం లాంటి రెండు విజయాలు దక్కడంతో ఈ నటుడు కి అవకాశాలు భారీగా పెరిగాయి.

దానితో ఈయన కూడా వరుస పెట్టి అనేక సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో చాలా తక్కువ సినిమాలు మంచి విజయాలను అందుకోవడం , ఎక్కువ శాతం మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో క్రమ క్రమంగా వరుణ్ క్రేజ్ తగ్గుతూ వచ్చింది. ఇకపోతే మధ్య లో కొంత కాలం పాటు ఈయన సినిమాలు ఏవి ప్రేక్షకుల ముందుకు రాలేదు. అలాంటి సమయం లో ఈయన తెలుగు బిగ్ బాస్ షో లోకి తన భార్యతో కలిసి ఎంట్రీ ఇచ్చాడు. ఇక బిగ్ బాస్ ద్వారా ఈయన బుల్లి తెర ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా వరుణ్ సందేశ్ "నింద" అనే సినిమాలో హీరో గా నటించాడు. కొన్ని రోజుల క్రితం థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే తాజాగా ఈ మూవీ ఈటీవీ విన్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ  ఇచ్చింది. ఈ మూవీ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో కేవలం ఒక్క రోజులోనే 1.4 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సొంతం చేసుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ సినిమా ఓ టి టి ప్లాట్ ఫామ్ లో మాత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: