బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన కొత్త సినిమా స్టిల్ అందర్నీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ స్టిల్ తో భారీ కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేస్తున్నారు అభిమానులు. మోక్షు క్రేజ్ మామూలుగా లేదు. సినిమా విడుదలు ముందే బాలయ్య తనయుడిని పెద్ద స్టార్ ని చేసేశారు నందమూరి ఫ్యాన్స్.టాలీవుడ్ లో సినిమా రిలీజ్ టైమ్ లో అభిమాన హీరోకి కటౌట్లు పెట్టి పూలదండలు వేసి హంగామా చేస్తుంటారు ఫ్యాన్స్. కటౌట్లు అంటే సినిమా రిలీజ్ టైమ్ లోనే అనుకుంటాం. ఇటీవల టీజర్లు, ట్రైలర్ లాంచ్ టైమ్ లో కూడా బ్యానర్లు, ఫ్లెక్సీలు వేస్తున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ సమయంలో కటౌట్లు కామన్ గా మారాయి. అయితే ఓ హీరో డెబ్యూ మూవీ స్టిల్ రిలీజ్ కాగానే కటౌట్లతో హంగామా చేయడం ఇదే ఫస్ట్ టైమ్. ఆ క్రెడిట్ నందమూరి మోక్షజ్ఞకే దక్కింది. ఈ సినిమాకి ఇంకా పేరు పెట్టలేదు. జస్ట్ ఓ స్టిల్ రిలీజ్ చేశారంతే. ఆ వెంటనే అభిమానులు కటౌట్లు కట్టి దండలు వేసి హంగామా మొదలు పెట్టారు.ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు, కనీసం సినిమా టైటిల్ అనౌన్స్ చేయలేదు , షూట్ మొదలు పెట్టలేదు. జస్ట్ హీరోగా వస్తున్నాడు అని ఒక్క పోస్టర్ ఇవ్వగానే ఆ పోస్టర్ తో అభిమానులు ఏకంగా 60 అడుగుల కటౌట్ పెట్టారు. ఆ కటౌట్ కి పాలాభిషేకాలు చేసారు.

పోస్టర్ తో బ్యానర్లు కట్టారు. కేకులు కోశారు, మోక్షజ్ఞ పేరుతో సేవా కార్యక్రమాలు చేసారు.అభిమానులు మోక్షజ్ఞ పేరుతో చేసే హడావిడి ఫోటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నందమూరి ఫ్యాన్స్ మోక్షజ్ఞ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఒక్క అనౌన్స్మెంట్ కే ఈ రేంజ్ లో సెలబ్రేట్ చేస్తున్నారంటే ఇక సినిమా రిలీజయితే ఫ్యాన్స్ సందడి ఆకాశాన్ని అంటుతుందేమో.మోక్షజ్ఞ గతంలో కూడా చాలాసార్లు మీడియాలో కనపడ్డారు. ఆమధ్య తన బావ నారా లోకేష్ పాదయాత్రకు కూడా హాజరయ్యారు. అయితే అప్పటికీ ఇప్పటికీ ఈ కుర్రాడి లుక్స్ లో చాలా మార్పు వచ్చింది. పర్ఫెక్ట్ ఫిజిక్ తో ఇప్పుడు సినిమాకోసం సిద్ధమయ్యాడు మోక్షు. అందులోనూ ఫస్ట్ లుక్ ఫొటో సూపర్ గా ఉంది. ప్రశాంత్ వర్మ ట్రీట్మెంట్ కూడా అలాగే ఉంది. అందుకే ఆ స్టిల్ తో నందమూరి అభిమానులు ఖుషీ అయిపోయారు. కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇక మోక్షు ఫస్ట్ మూవీ రిలీజ్ రోజు పూనకాలే అని వేరే చెప్పాల్సిన పనిలేదు.హనుమాన్‌ మూవీతో సూపర్‌ హిట్‌ కొట్టిన ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞను హీరోగా టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య కూడా గెస్ట్ రోల్ లో కనపడతారని అంటున్నారు. మోక్షజ్ఞ బర్త్‌ డే కావడంతో ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ సోషల్ మీడియాలో విడుదల చేశారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: