జనతా గ్యారేజ్ వంటి క్లాస్ హిట్ ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర. ఆచార్య డిజాస్టర్ తర్వాత తనను తాను నిరూపించుకోవాలని కొరటాల శివ కసిగా ఈ సినిమా చేస్తున్నారు. దేవర ద్వారా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ali KHAN' target='_blank' title='సైఫ్ అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. అనిరుధ్ స్వరాలు అందిస్తున్నారు. సెప్టెంబర్ 27న దేవర పార్ట్ -1 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలావుండగా ఓటిటి సంస్ద దేవర ఓటిటి రైట్స్ లాక్ చేసింది. ఈ చిత్రం ఓటిటి డీల్ భారీ రేటుకు క్లోజ్ అయ్యినట్లు తెలుస్తోంది.తెలుగులో రిలీజ్ అయ్యే అతి పెద్ద సినిమాల్లో దేవర ఒకటి.'దేవర' మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుండటంతో బిజినెస్ కూడా క్లోజ్ అయ్యిపోయింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రమోషన్ మెటీరియల్ జనాల్లోకి బాగా వెళ్లటంతో భారీగా బజ్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ బిజినెస్ కు కారణమవుతోంది. యాక్షన్ మామూలుగా ఉండదని , అరాచకం అని కొరటాల ఎలాగైనా ఇండస్ట్రీ మారుమ్రోగే స్దాయిలో హిట్ కొట్టాలని అన్ని జాగ్రత్తలు తీసుకుని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాపై అభిమానుల కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి డీల్ భారీ రేటుకు క్లోజ్ అయ్యినట్లు తెలుస్తోంది.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు Netflix ఓటిటి సంస్ద దేవర ఓటిటి రైట్స్ లాక్ చేసింది. 150 కోట్లు ఇచ్చి ఈ చిత్రం ఓటిటి రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో తెలుగులో ఇదే హైయిస్ట్ ఓటిటి డీల్. నెగోషియేషన్స్ త్వరలోనే ఎగ్రిమెంట్ అవుతుందని వినికిడి. భారీ రేటుకు ఓటిటి రైట్స్ వెళ్ళటంతో నిర్మాతలు బడ్జెట్ లో సగం ఇక్కడే రికవరీ అవుతోందని హ్యాపీగా ఉన్నారు. దేవరచిత్రం ఓటిటి రైట్స్ ఆ స్దాయిలో పలకటానికి కారణం ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి ప్రవేశించటమే అంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ మారిపోయింది. దానికి తోడు దేవర చిత్రంలో జాహ్నవి కపూర్, ali KHAN' target='_blank' title='సైఫ్ అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్స్ ఉండటంతో ప్యాన్ ఇండియా రీచ్ ఈజిగా అవుతుంది. తెలుగుతో సమానంగా హిందీ వ్యూయర్స్ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారని నమ్మకంతో నెట్ ప్లిక్స్ ఉంది. తెలుగుతో పాటు ఈ చిత్రం తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల ఓటీటీ రైట్స్‌ను కలిపి నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. అందుకే నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం రూ.150 కోట్లు ఖర్చుపెట్టిందని సమాచారం.

థియేటర్లలో 'దేవర' విడుదల అయిన 56 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల కావాలని ఎగ్రిమెంట్ కూడా జరిగిందని తెలుస్తోంది. ఇక ఓటీటీ రైట్స్ కోసం రూ.150 కోట్లు ఖర్చు పెట్టడం అనేది మామూలు విషయం కాదని అభిమానులు చెప్తూ పండగ చేసుకుంటున్నారు.మరోవైపు దేవర బిజినెస్‌ కూడా ఓ రేంజ్‌లో జరుగుతున్నట్లుగా ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల రైట్స్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్ దక్కించుకుని.. తిరిగి ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూటర్స్‌కు ఇస్తున్నారు. ఆల్రెడీ హిందీ రైట్స్ కూడా రూ.45 కోట్ల వరకు పలికాయని టాక్. ఆర్ఆర్ఆర్‌తో వచ్చిన క్రేజ్.. ఎన్టీఆర్‌కు వరంగా మారి హిందీ బెల్ట్‌లోనూ ఆయనకు ఫాలోయింగ్ వచ్చింది. దీంతో దేవరకు అక్కడా ఫ్యాన్సీ రేటు దక్కినట్లుగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ నార్త్ థియేట్రికల్ రైట్స్‌ను దక్కించుకుని ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు కూడా. కన్నడ థియేట్రికల్ రైట్స్‌ను దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తీకేయ, కన్నడ డిస్ట్రిబ్యూషన్ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్‌తో కలిసి కొనుగోలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: