తమిళ నటుడు సూర్య ప్రస్తుతం కాంగువ అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. దిశా పటానిమూవీ లో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాను అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించిన తర్వాత సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా టిజె జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న వెట్టాయాన్ మూవీ ని అక్టోబర్ 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ బృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

దానితో సూర్య హీరోగా రూపొందుతున్న కంగువా మూవీ పోస్ట్ పోన్ కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆల్మోస్ట్ కంగువా మూవీ విడుదల వాయిదా కానున్నట్లే తెలుస్తోంది. ఇకపోతే ఇక్కడే అసలు సమస్య ఏర్పడింది. ప్రస్తుతం వేట్టాయన్ మూవీ కూడా ఆగస్టు 11 వ తేదీన విడుదల కావడం కష్టం అని , ఆ సినిమా కూడా వాయిదా పడబోతుంది అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఒక వేళ నిజంగానే వెట్టాయన్ సినిమా విడుదల కనుక వాయిదా పడినట్లు అయితే మొదట చెప్పినట్లు ఆగస్టు 10 వ తేదీనే కంగుబా మూవీ ని విడుదల చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ రెండు సినిమాలలో ఏ సినిమా అక్టోబర్ నెలలో విడుదల అవుతుందో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న కాంగువ మరియు వెట్టయన్ ఈ రెండు మూవీ లపై కూడా తమిళ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమాలు ఏ తేదీల్లో విడుదల అయ్యి ఆ రేంజ్ విజయాలను అందుకుంటాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: