మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమాలో చరణ్ కి జోడిగా కియర అద్వానీ నటిస్తూ ఉండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించనున్న ఈ మూవీ లో అంజలి , సునీల్ , శ్రీకాంత్ , నవీన్ చంద్ర ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఇకపోతే ఒక సెంటిమెంట్ ద్వారా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని మెగా ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అదేమిటి అనే వివరాలను తెలుసుకుందాం. ఈ మూవీ బృందం ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ నుండి ఓ పోస్టర్ను విడుదల చేసింది. ఆ పోస్టర్లో చరణ్ తలకి ఒక ఎర్ర కండువాను కట్టుకొని కనిపించాడు. ఇది వరకు మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ముఠామేస్త్రి సినిమాలో కూడా చిరంజీవి తన తలకు ఎర్ర కండువాను కట్టుకొని కొన్ని సన్నివేశాలలో కనిపిస్తాడు.

సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. చరణ్ , బాబాయి అయినటువంటి పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీ లో తలకు ఎర్ర కండువాను కట్టుకొని కొన్ని సన్నివేశాలలో కనిపిస్తాడు. ఆ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. దానితో మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఓ వైపు చిరంజీవి , మరో వైపు పవన్ కళ్యాణ్ ఎర్ర కండువాను తలకు కట్టుకున్న సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాడు. ఇక చరణ్ కూడా గేమ్ చేంజర్ మూవీలో తలకు ఎర్ర కండువాను కట్టుకున్నాడు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంటుంది అని మెగా ఫ్యాన్స్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: