యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ‘దేవర పార్ట్ 1’ సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా అనిరుద్ మ్యూజిక్ ఇస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఇప్పటివరకు బయటకు వచ్చిన దేవర ప్రమోషనల్ కంటెంట్ అద్భుతంగా ఆకట్టుకుంది. ఐతే, దేవర పార్ట్ 1 క్లైమాక్స్ పై ఓ న్యూస్ వినిపిస్తోంది. మొదటి పార్ట్ 1 లకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన సినిమాల క్లైమాక్స్ లు ఒక ఎత్తు అయితే, దేవర క్లైమాక్స్ మరో ఎత్తు అని తెలుస్తోంది. యాక్షన్ అభిమానులకు ఈ సినిమా క్లైమాక్స్ ఓ ఫీస్ట్ అట. ముఖ్యంగా దేవర

 ఊచకోతకు వెన్నులో వణుకు పుడుతుందని, బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల సునామీ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. మరి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తోందో చూడాలి. కాగా ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్ లతో పాటు శ్రీకాంత్ తదితరులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఒవర్సీస్ లో అడ్వాన్స్‌ బుక్కింగ్స్‌ లో సరికొత్త రికార్డులతో దూసుకెళుతోంది దేవర. యూఎస్ఏ ప్రీమియర్ కు మరో 18 రోజుల సమయం ఉండగానే రికార్డు సమయంలోనే 25 వేల టికెట్లు అమ్ముడైనట్లు కూడా మేకర్స్ వెల్లడించారు. ఇప్పడే ఇలా ఉంటే ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సేల్స్ మరింత పెరిగి రిలీజ్

 సమయానికి ఎన్ని రికార్డులు బ్రేకవుతాయో చూడాలి. నార్త్ అమెరికా సేల్స్ చుస్తే ప్రస్తుతానికి 335 లొకేషన్స్ లో 945 షోలకు గాను $810,048 రాబట్టింది. టికెట్స్ పరంగా చుస్తే 26K+ పైగా బుక్ అయ్యాయి. USA లో అత్యంత ఫాస్ట్ గా 26 వేల టికెట్స్ బుక్ అయిన చిత్రంగా మరొక రికార్డ్స్ క్రియేట్ చేసింది దేవర. US ప్రీమియర్స్ కు ఇంకా 18 రోజులు ఉండగా దేవర ఈ రేంజ్ బుకింగ్స్ సాధించడం ఒక రికార్డు అనే చెప్పాలి. ఓవర్సీస్ మొత్తంగా $ 882,230 గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే ఈ చిత్రం రెబల్ స్టార్ నటించిన కల్కి అడ్వాన్స్ బుక్కింగ్స్‌ కలెక్షన్స్ ను క్రాస్ చేసింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: