పాపులర్‌ టెలివిజన్‌ రియాలిటీ షో బిగ్‌ బాస్‌ తమిళ్‌  కొన్ని రోజులుగా తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ తమిళ్‌ అప్‌కమింగ్ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించడం లేదని ఉలగనాయగన్‌ కమల్ హాసన్‌ అధికారికంగా ప్రకటించడంతో నెక్ట్స్ ఎవరు ఈ బాధ్యతలు తీసుకోబోతున్నారంటూ ఆసక్తికర చర్చ న‌డిచింది. అయితే ఈ వార్త‌ల‌కు చెక్ పెడుతూ.. తాజాగా హోస్ట్‌తో పాటు కొత్త సీజ‌న్ 8కు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను ఇచ్చారు నిర్వ‌హాకులు. బిగ్ బాస్ సీజన్ 8కి మ‌క్క‌ళ్ సెల్వ‌న్ విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరిస్తారని విజయ్ టెలివిజన్ ప్రకటించింది. ఈ సంద‌ర్భంగా బిగ్ బాస్ సీజ‌న్ 8కి

 సంబంధించిన టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ టీజ‌ర్‌లో విజ‌య్ హోస్ట్‌గా క‌నిపిస్తూ అలరిస్తున్నాడు. ఇటీవ‌లే మహారాజతో సూపర్ హిట్ అందుకున్న మక్కళ్ సెల్వన్ ప్రస్తుతం విడుదల పార్ట్ 2తో పాటు గాంధీ టాక్స్ అనే సినిమాలో న‌టిస్తున్నాడు. అయితే బిగ్ బాస్‌కి హోస్ట్‌గా విజ‌య్ చేస్తుండ‌టంతో సేతుప‌తికి అటు సినిమాల‌తో పాటు ఇటు బుల్లితెర‌లో డబుల్ క్రేజ్ వ‌స్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు సినీ జనాలు. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ కోసం విజయ్‌ సేతుపతి ఎంత రెమ్యునరేషన్‌ తీసుకోనున్నారని పెద్ద చర్చే జరుగుతుంది.విజయ్ సేతుపతి ఇటీవలే మహారాజ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు.

 సుమారు రూ.120 కోట్లకు పైగా ఈ చిత్రం కలెక్షన్లు రాబట్టింది. దీంతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఆయన మార్కెట్‌ కూడా పెరిగింది. ఈ విజయం తర్వాత బిగ్‍బాస్ తమిళ్ 8వ సీజన్ హోస్టింగ్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 100 రోజుల పాటు సాగే ఈ బిగ్‌ బాస్‌ సీజన్‌కు భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్‌ తీసుకోనున్నట్లు సమాచారం. ప్రతి శనివారం, ఆదివారం మాత్రమే ఆయన బిగ్‌బాస్‌లో కనిపిస్తారు. అందుకుగాను సుమారు రూ. 60 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకోనున్నారని ప్రచారం జరుగుతుంది.విజయ్‌ సేతుపతి ఒక్కో సినిమాకు రూ. 15 నుంచి రూ. 20 కోట్ల వరకు తీసుకుంటారు. ఏదైనా ఒక యాడ్‌లో నటిస్తే రూ. 1కోటి వరకు ఛార్జ్‌ చేస్తారని టాక్‌...!!

మరింత సమాచారం తెలుసుకోండి: