నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి దాదాపుగా అయిదు ఆరు సంవత్సరాలుగా ప్రచారం జరుగుతోంది. ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడా అంటూ నందమూరి ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో దర్శకుడు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ఎంట్రీకి ముహూర్తం ఖరారు అయింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారంకు ఫుల్‌ స్టాప్‌ పెట్టి అధికారిక ప్రకటన వచ్చింది.  మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా ఆయన లుక్‌ ను రివీల్‌ చేయడం జరిగింది. మోక్షజ్ఞ గతంతో పోల్చితే బాగా సన్నగా అయ్యాడు. ఎన్టీఆర్ కెరీర్‌ ఆరంభంలో లావుగా ఉండేవాడు. ఆ తర్వాత చాలా

 సన్నగా అయి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. అన్నయ్య ఎన్టీఆర్‌ లాగే మోక్షజ్ఞ కూడా ఇంతకు ముందు లుక్ కి ఇప్పుడు  విడుదల అయిన లుక్ కి అసలు సంబంధం లేనట్లుగా తయారు అయ్యాడు.  అయితే మోక్షూ ఎంట్రీపై ఫ్యాన్స్ వెయ్యికళ్ళతో ఎదురుచూశారు. కొంత మంది మాత్రం గట్టిగా ట్రోల్స్ చేశారు. మొన్నటి వరకూ మోక్షజ్ఞ పర్సనాలిటీ.. వెయిట్.. చూసి.. ఇతనేం హీరో అవుతాడు అంటూ ఎగతాళి చేసిన వారు ఉన్నారు. ఇక బాలయ్య వారసుడు సినిమాల్లోకి రావడం కష్టమే అని అన్నవారు కూడా ఉన్నారు.  కాని ఒక్క విషయం వారు మర్చిపోయారు. నందమూరి హీరోలంటేనే కాస్త బబ్లీ గా ఉంటారు. బాలయ్య, యంగ్

 టైగర్ వీళ్లంతా కాస్త బరువు తో కనిపించే హీరోలే. ఇప్పుడంటే ఎన్టీఆర్ స్లిమ్ గా ఉన్నాడు కాని.. కంత్రీ సినిమాకు ముందు తారక్ ఎలా ఉండేవాడో అందరికి తెలుసు. తారక్ మొదటి సినిమా తరువాత వరుసగా సినిమాలు చేస్తూ.. రాను రాను స్లిమ్ అవ్వకుండా, అశోక్ సినిమా టైమ్ కు చాలా బరువు పెరిగి అభిమానులను టెన్షన్ పెట్టాడు. ఇక బాలకృష్ణ వారసుడు గా ఎంట్రీ ఇస్తాడు అనుకున్న మోక్షజ్ఞ కూడా బొద్దుగా, బరువు గా కనిపించినప్పుడల్లా నందమూరి అభిమానులు ఆందోళన పడిపోయేవారు. మరి నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇస్తున్న మోక్షజ్ఞత మొదటి సినిమాతో ఎటువంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: