టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగించిన ముద్దుగుమ్మలలో అనుష్క , సమంత , కాజల్ ఉంటారు. వీరు ముగ్గురు కూడా కెరియర్ను మొదలు పెట్టిన చాలా తక్కువ కాలంలోనే అద్భుతమైన విజయాలను అందుకొని ఫుల్ స్పీడ్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల స్థాయికి ఎదిగారు. ఇక కెరియర్ ప్రారంభంలో వీరు ముగ్గురు కూడా ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాలలోనే నటిస్తూ వచ్చారు. కమర్షియల్ సినిమాలలో నటించడం వల్ల వీరు ముగ్గురు ఎక్కువగా శాతం కెరియర్ ప్రారంభంలో తమ నటన కంటే కూడా అందాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చారు.

ఇకపోతే వీరి క్రేజ్ బాగా పెరిగిన తర్వాత ఈ ముద్దు గుమ్మలు కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపు కూడా కాస్త ఆసక్తిని చూపించడం మొదలు పెట్టారు. అందులో భాగంగా ఈ ముగ్గురులో మొదటగా అనుష్క లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించడానికి ఆసక్తిని చూపించడం మొదలు పెట్టింది. అందులో భాగంగా అరుంధతి , భాగమతి మరికొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలలో అనుష్క ప్రధాన పాత్రలో నటించింది. అందులో అరుంధతి , భాగమతి సినిమాలు ఈమెకు అద్భుతమైన విజయాలను అందించాయి. ఇక సమంత ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపు ఆసక్తిని చూపించడం స్టార్ట్ చేసింది. ఈ ముద్దుగుమ్మ కూడా చాలా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించినప్పటికీ యశోద , యూటర్న్ లాంటి మూవీలు మంచి విజయాలను అందుకున్నాయి.

ఇకపోతే కాజల్ కూడా ఈ మధ్య కాలంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తుంది. కానీ ఈ ముద్దుగుమ్మ ఎన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించిన అనుష్క , సమంత స్థాయిలో సక్సెస్ లను అందుకోలేక పోతుంది. కొన్ని రోజుల క్రితమే ఈమె సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించిన ఆ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దానితో కాజల్ లేడీ ఓరియంటెడ్ సినిమాల విషయంలో అనుష్క , సమంత స్థాయిలో సక్సెస్ కాలేక పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: