ప్రస్తుతం మీడియాలో ఎక్కడ చూసినా జయం రవి విడాకుల మ్యాటరే వైరల్ అవుతుంది.దానికి ప్రధాన కారణం ఆయన అఫీషియల్ గా తన విడాకుల విషయాన్నీ బయట పెట్టడమే. అయితే గత నాలుగైదు నెలల నుండి వీరి విడాకుల మ్యాటర్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ వాళ్లు స్పందించకపోవడంతో రూమర్ అని అందరు అనుకున్నారు.కానీ తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్టు జయం రవి ప్రకటించడంతో అందరూ షాక్ లో మునిగిపోయారు. అంతేకాదు ఇదేంటి ఇంత సడన్గా అని కొంతమంది బాధపడుతున్నారు. అయితే మరికొంతమంది మాత్రం ఎప్పటినుండో అనుకుంటున్న విషయమే కదా.. కానీ విడాకులు వచ్చాక వీళ్ళు ఈ విషయాన్ని బయట పెట్టారు అంతే అని కామెంట్లు పెడుతున్నారు. 

ఏది ఏమైనప్పటికి స్టార్ హీరో విడాకులు ప్రస్తుతం కోలీవుడ్లో సంచలనం సృష్టిస్తోంది.ఇదిలా ఉంటే ఓవైపు విడాకుల మేటర్ ప్రకటించడంతోనే మరోవైపు జయం రవి రెండో పెళ్లి వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దానికి ప్రధాన కారణం అప్పట్లో ఓ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలే.. అసలు విషయం ఏమిటంటే.. స్టార్ హీరో రజినీకాంత్ తన పెద్ద కూతురు సౌందర్యని జయం రవికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారట.కానీ అప్పటికే జయం రవి,ఆర్తి ఇద్దరు ప్రేమలో ఉన్న విషయం ఆర్తి తల్లికి తెలిసి తొందరగా పెళ్లి చేసేసిందట. దాంతో రజినీకాంత్ కూడా తన కూతురు పెళ్లి ఆలోచనలు మానేసుకున్నారట.
 

ఒకవేళ జయం రవి ఆర్తితో ప్రేమలో పడకపోతే ఖచ్చితంగా రజినీకాంత్ తన ఇంటి అల్లుడుగా చేసుకునే వారని జర్నలిస్టు సబిత జోసెఫ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.అయితే ప్రస్తుతం జయం రవి విడాకులు అఫీషియల్ గా చెప్పడంతో అప్పుడు జర్నలిస్టు సబితా చెప్పిన మాటల్ని వైరల్ చేస్తూ జయం రవి భార్యకు విడాకులు ఇచ్చేశాడు. అలాగే రజినీకాంత్ కూతురు సౌందర్య కూడా ధనుష్ కి విడాకులు ఇచ్చేసింది.ప్రస్తుతం వీరిద్దరూ సింగిల్ కాబట్టి వీరిద్దరూ త్వరలోనే రెండో పెళ్లి చేసుకుంటారు కావచ్చు అంటూ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: